చీడపురుగులు,తెగుళ్ల వల్ల పత్తి పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోండి.... ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్

 చీడపురుగులు,తెగుళ్ల వల్ల పత్తి పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోండి

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం  డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా  ప్రతినిధి)

నంద్యాలజిల్లా పాణ్యం మండలం తమ్మరాజు పల్లె గ్రామంలో చీడ పురుగులు మరియు తెగుళ్ల వల్ల పత్తి పంటలు వేసి తీవ్రంగా నష్టపోయిన రైతుసోదరుల పంటలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బరాయుడు,రైతు సంఘం జిల్లానాయకులు ప్రసాద్ మాట్లాడుతూ తమ్మరాజు పల్లె గ్రామంలో రైతులు సుమారు 280 ఎకరాలలో డి,బస్వ-డి, కిలాడి పేర్లుగల పత్తి విత్తనాలు ఖరీఫ్ సీజన్లో సాగుచేశారని,ఈ ఖరీఫ్ సీజన్లో వర్షాలు తక్కవ పడ్డాయని, వ్యయప్రయసాలతో పంటలను సాగు చేశారని, పత్తి పైరు ఎండిపోకుండా బోరుబావుల ద్వారా అద్దెలు చెల్లించి నీటిని పంట పొలాలకు తరలించిన పత్తి చెట్లుకు కాయలు కాయలేదని, పత్తి చెట్లన్ని ఎర్రగా మారి పత్తి పంటలన్నీఎండిపోయాయని


గ్రామరైతులు ఆవేదన చెందుతున్నారని, నంద్యాల జిల్లా ఎపి రైతుసంఘం ఆధ్వర్యంలోతమ్మరాజుపల్లె గ్రామంలో వేసిన పత్తి పంట వేసిన రైతులతో కలసి పత్తి పంట పొలాలను పరిశీలించామని, పత్తి పంట సాగుకు రైతు సోదరులకు ఒక ఎకరాకు దాదాపు 50 వేలు రూపాయలు ఖర్చులు అయ్యాయ్యని, సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి పత్తి పంటలను పరిశీలించి, ఉన్నతాధికారులకు తెలియజేసి తమ్మరాజుపల్లె రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బాలచంద్రుడు, వెంకటసుబ్బయ్య, రామాంజనేయులు, మద్దిలేటీ, అచ్చన్న, వెంకటరాముడు, పుల్లయ్య, శివుడు, మహేంద్ర, బాల మద్దిలేటీ, లక్ష్మన్న, శ్రీరాములు, మధుసూదన్ నాయుడు, తమ్మరాజు పల్లె రైతులు, కౌలురైతులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: