అంకాలమ్మచుంచుగూడెంలో మౌలిక సదుపాయాలు కల్పించాలి.... కొమరం భీమ్ చెంచు గిరిజన సంక్షేమసంఘం, భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఇఫ్టూ)సంఘాలు డిమాండ్

 అంకాలమ్మచుంచుగూడెంలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

కొమరం భీమ్ చెంచు గిరిజన సంక్షేమసంఘం,

భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఇఫ్టూ)సంఘాలు డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా రుద్రవరం మండలం అంకాలమ్మ చెంచుగూడెం చెంచుల సమస్యలను పరిష్కరించాలని ఆదివాసి కొమరం భీమ్ చెంచు గిరిజన సంక్షేమ సంఘం, భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఇఫ్టూ) సంఘాలు సంయుక్తంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ వెంకటమురళికి టైగర్ డైరెక్టర్ రవీంద్రబాబుకి డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశామని తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఆశీర్వాదం, భారతకార్మిక సంఘాల సమైక్య(ఇప్టూ) ఉమ్మడి జిల్లా కార్యదర్శి అరుణ్ కుమార్ లు మాట్లాడుతూచెంచుగూడెం నివాసులకు ఇండ్లపట్టాలు మంజూరు చేసి ఇల్ల నిర్మాణం చేపట్టాలని,  40 సంవత్సరాలుగా 26 కుటుంబాలు గుడిసెల్లో జీవనం కొనసాగిస్తున్నారని,  ఉపాధి లేక ముంబై,   తెలంగాణ రాష్ట్రాలకు వలసవెళ్లి  బ్రతుకుతున్నారని, రోడ్లు, ఇల్లు, మరుగుదొడ్లు వంటి మౌలిక సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గూడెంపక్కన ఉన్న 150 ఎకరాల బంజరు భూమిని చెంచులకుకేటాయించాలని ,


అహోబిలంలో జీవిస్తున్న చెంచు ప్రజలకు చెపల చెరువులు కేటాయించడం ద్వారా ఉపాధి కలుగుతుందని, ఇప్పటికైనా చెంచుగూడెం, అహోబిలంలో జీవిస్తున్న చెంచు ప్రజలకు మౌలిక సౌకర్యాలు, భద్రత, విద్య వైద్యం, ఉపాధికల్పించాలని, ప్రభుత్వ పథకాలు అన్ని అందేలా చూడాలని విజ్ఞప్తి చేశామని, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ వెంకట మురళికి టైగర్ డైరెక్టర్ రవీంద్రబాబుకి డిమాండ్ లతో కూడిన వినతిపత్రం అందించగా చెంచుగూడెం సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారని, చెంచుగూడెంకు సంబంధించిన సమస్యలు పై సమగ్రమైన రిపోర్టు పంపించాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమరం భీమ్ చెంచు  గిరిజనసంక్షేమ సంఘం అధ్యక్షులు ఆశీర్వాదం, భారత కార్మిక సంఘాల సమైక్య(ఇప్టూ) రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణ, రాష్ట్ర నాయకులు అరుణ్ కుమార్, రవీంద్ర, ఆవులమ్మ, రమణమ్మ, నాగరాజు, సుంకమ్మ, వెంకటేశ్వరం తదితరులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: