నంద్యాల ను జీవితంలో మర్చిపోలేను.... మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు

 నంద్యాల ను జీవితంలో మర్చిపోలేను..

మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

బాబు  షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా నంద్యాలకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి టిడిపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నంద్యాలలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నంద్యాల నవనందుల కోటని,పుణ్య క్షేత్రాలు నిలయం నంద్యాలని, దేశంలో ఎందరో నేతలు గెలిచిన గడ్డ నంద్యాలని, నంద్యాల, కర్నూల్ ను అభివృద్ధి చేసింది టిడిపి అని, నంద్యాలలో  సండే ఎమ్మెల్యే ఏమైనా చేశారని అడుగుతున్నా, కర్నూల్, నంద్యాలకు ఒక్క ఇండస్ట్రీ అయినా వచ్చిందా, రాష్ట్రంలో ఒక్క ఇరిగేషన్ ప్రాజక్టు పూర్తినాచేసారా, రాష్ట్రంలో రైతు పరిస్తితి గమనించండని,  నంద్యాలలో ఆటో నగర్ టిడిపి హయంలోనే ఏర్పాటు చేసిన ఘనత టిడిపిదని,


అపద్దాల ముఖ్య మంత్రికి ఓటు వేస్తారా అని ఎన్నికల ముందు ఇచ్చిన జగన్ హామీలు ఆడియో ద్వారా ప్రజలకు వినిపించి,  మాయమాటల ముఖ్యమంత్రి మోసపూరిత వాగ్దానాలు విన్నారా, లేదా అని  ప్రజలను అడిగి, ప్రత్యేక హోదా ఊసెత్తని ముఖ్యమంత్రి జగన్,  నన్ను తిడితే మంత్రి పదవులు ఇస్తున్నాడని,  10 లక్షల కుటుంబాలకు రంజాన్ తోపా ఇచ్చిన ఘనత టిడిపి దేనని,  "బాబు సూరిటీ-భవిషత్ గ్యారెంటీ"అని హామీ ఇస్తున్నానని,ప్రతి ఒక్కరినీ కాపాడుకునే బాధ్యత నాదని,ప్రతి పేద వాడి ఆకలని తీర్చడానికి అన్నా క్యాంటీన్ పెడితే తీసేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని,చంద్రన్న కానుక,రంజాన్ తోఫా అందించామని, మహా శక్తి,మహిళలకు మహిళా నిధి,ఏడాదికి మూడు సిలిండర్ లు ఉచితంగా ఇస్తానని,మహిళలకు ఆర్టీసి బస్ ఉచిత ప్రయాణం మీ కోసమే చేస్తున్నానని,జాబ్ కావాలంటే బాబు రావాలి అనే విధంగా చేస్తానని, నిరుద్యోగ భృతి అందిస్తానని,సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి,వర్క్ అట్ హోమ్ ఏర్పాటు చేస్తానని,రైతులకు అండగా వుంటానని, ప్రజలకు సురక్షితమైన నీళ్ళు అందిస్తామని,  నంద్యాలలో10 వేళ ఇండ్లు మంజూరు చేసినా నేటికీ ఇల్లు ఇవ్వకుండా రంగులు మాత్రం వేసుకున్నారని, 
కుందూ పూడిక తీత పనులు ఆగిపోయాయని,  నంద్యాల పూర్వవైభవం తీసుకొచ్చే బాధ్యత నాదే నని,దసరా కానుకగా అన్ని వర్గాలకు న్యాయం చేసే మానిఫెస్టో అందిస్తానని, 200 రూపాయల పింఛన్ ను 2000 చేసింది ఎవరిని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాల బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పోలిట్ బ్యూరో ఎన్ఎండి ఫరూక్, నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గౌడ్, రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులుముస్తాక్ మౌలానా,  శివానందరెడ్డి, ,భూమా బ్రహ్మానంద రెడ్డి, తెలుగుదేశం పార్టీలో చేరిన వాహిద్ భాష నంద్యాల టిడిపి ముఖ్య నేతలు నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: