నంద్యాలలో హైటెన్షన్‌... చంద్రబాబును అర్ధరాత్రి అదుపులో తీసుకునేందుకు,,నిరాకరించిన...ఎన్‌ఎస్‌జీ సిబ్బంది... తెల్లవారుజామున చంద్రబాబును అదుపులోకి త

 నంద్యాలలో హైటెన్షన్‌... 

చంద్రబాబును అర్ధరాత్రి అదుపులో తీసుకునేందుకు,,నిరాకరించిన...ఎన్‌ఎస్‌జీ సిబ్బంది... 

తెల్లవారుజామున చంద్రబాబును అదుపులోకి తీసుకున్న సిఐడి అధికారులు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాలలో అర్ధరాత్రి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. తెదేపా అధినేత చంద్రబాబును సిఐడి అధికారులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా,ప్రోటోకాల్‌ ప్రకారం కలుసుకోవడానికి ఉదయం 5.30 గంటల వరకు అనుమతి ఇవ్వబోమని ఎన్‌ఎస్‌జీ తెలపడంతో సిట్ అధికారులు తెల్లవారుజామున 5:30 వరకు చంద్రబాబు బసచేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద వేచి ఉండి ఉద్రిక్తతల నడుమ అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు నాయుడును అర్ధరాత్రి అరెస్టు చేసెందుకు సిఐడిఅధికారులు, పోలీసులు భారీగా ఆర్‌కె. ఫంక్షన్‌ హాల్‌ వద్దకు చేరుకున్నారన్న విషయం తెలుసుకున్న టిడిపి శ్రేణులు భారీ సంఖ్యలో ఆర్‌కె.ఫంక్షన్‌ హాల్‌ వద్దకు తరలివచ్చారు. ఈ సందర్భంగా తెదేపా నేతలు,పోలీసులతో తోపులాటచోటుచేసుకున్నాయి. నంద్యాలోని ఆర్‌కె.ఫంక్షన్‌ హాల్‌ వద్దకు అదుపులో తీసుకునెందుకు వచ్చిన సిఐడి ఆధికారులతో టిడిపి అధినేత చంద్రబాబు మాట్లాడుతూ నాహక్కులు ఎందుకుఉల్లంఘిస్తున్నారని, నేనుతప్పుచేస్తే నడిరోడ్డులో  ఉరేయండని,


ఏచట్టప్రకారం నన్ను అరెస్టు చేస్తారు...? ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అదుపులోకి తీసుకుంటారన్నారని ప్రశ్నించారు. ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదని న్యాయవాదులు ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్‌ లో పేరు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ఈ సందర్భంగా తెదేపా అధినేత పోలీసులతో తనని అరెస్టు చేసే ముందు ఆ పత్రాలను ఇవ్వాలని, దేని గురించి అరెస్టు చేస్తారనే అడిగే హక్కు సామాన్యులకు కూడా ఉందని, సూపర్‌వైజర్‌ ఆఫీసర్‌ రావాల్సిన అవసరం ఏముందని చంద్రబాబు పోలీసులను ప్రశ్నించారు. చంద్రబాబు తరఫున న్యాయవాదులు పోలీసులతో,ప్రాథమిక ఆధారాలు చూపించాలని అడిగగా, పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో అన్నీ ఉన్నాయని, ఎఫ్‌ఐఆర్‌ ఇస్తామన్నారు. ప్రాథమిక ఆధారాలు చూపించాల్సిందేనని న్యాయవాదులు పట్టుబట్టారు. సూపర్‌ వైజర్‌ ఆఫీసర్‌ రావాల్సిన అధికారం ఏముందని చంద్రబాబు పోలీసులను ప్రశ్నించారు.చంద్రబాబు తరఫున న్యాయవాదులు పోలీసులతో,ప్రాథమిక ఆధారాలు చూపించాలని అడిగగా, పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో

అన్నీ ఉన్నాయని, ఎఫ్‌ఐఆర్‌ ఇస్తామన్నారు. ప్రాథమిక ఆధారాలు చూపించాల్సిందేనని, ఆధారాలు చూపించకుండా చంద్రబాబును అదుపులోకి తీసుకోవడం చట్టవిరుద్ధమని న్యాయవాదులు తెలిపారు. టిడిపి అధినేత చంద్రబాబు వాహనం చుట్టూ ఉన్న తెదేపా నేతలు కాలవ శ్రీనివాసులు, భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిలప్రియ, భూమా జగత్‌ విఖ్యాత్‌రెడ్డి, ఎవి.సుబ్బారెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి, మరియు నంద్యాల స్థానిక తెదేపా నేతలను అరెస్టు చేసి చంద్రబాబు నాయుడుకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అధినేత చంద్రబాబును డీఐజీ రఘురామరెడ్డి, జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులను మోహరించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు, చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి సిఐడి అధికారులు అదుపులోకి తీసుకొని నంద్యాలోని ఆర్‌కె.ఫంక్షన్‌ నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: