భ్రూణ హత్యలు నివారించడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి..... బేతంచెర్ల పాణ్యం సిమెంట్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బాలకృష్ణ, సామాజిక కార్యకర్త మహమ్మ

 భ్రూణ హత్యలు నివారించడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

బేతంచెర్ల పాణ్యం సిమెంట్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బాలకృష్ణ,

సామాజిక కార్యకర్త మహమ్మద్ రఫీ

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాబనగానపల్లె నియోజకవర్గం బేతంచెర్ల పట్టణంలోని పాణ్యం సిమెంట్ జూనియర్ కళాశాలలోభారతదేశములో మొదటి గొప్ప సంఘ సంస్కర్త  శ్రీరాజారామ్మోహన్ రాయ్ వర్ధంతి సందర్బంగా  పీఎన్‌డీటీ(గర్భస్థ పిండ పరీక్ష నివారణ) చట్టంపై విద్యార్థులకు అవగాహణ సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మనదేశంలో గణాంకాలను పరిశీలిస్తే ఆడపిల్లల నిష్పత్తి గణనీయంగా తగ్గుతున్నదని, కాలానుగుణంగా దంపతులు మగపిల్లాడు పుడితే బాగుంటుందని భావించడం వల్లే ఆడపిల్లల భ్రూణ హత్యలు జరుగుతున్న కారణంగా నివారించేందుకు ప్రభుత్వం 1994లో పిసి పీఎన్‌డీటీ (గర్భస్థ పిండ పరీక్ష నివారణ) చట్టాన్ని తీసుకొచ్చిందని, ఈ చట్టంపై పూర్తిస్థాయిలో  అవగాహన అవసరమని, సమాజంలో ఆడ మగ ఇద్దరూ  సమానమేనని, లింగ వివక్ష చూపడం సరికాదని, ఆడపిల్లలను పుట్టనిద్దాం,  పెరగనిద్దాం, చదవనిద్దామని, (PC - PNDT ) ప్రీ-కాన్సెప్షన్ మరియు ప్రీ-నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ 1994 భారతదేశంలో ఆడబిడ్డల భ్రూణహత్యలను ఆపడానికి, భారతదేశంలో క్షీణిస్తున్న లింగనిష్పత్తిని అరికట్టడానికి రూపొందించబడిన భారత  పార్లమెంటు చట్టమని, ప్రస్తుత సమాజంలో బాలికల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో లింగనిర్ధారణ, నివారణ చట్టంపై మరియు  గర్భస్థ పిండంగా ఉండగానే ఆడబిడ్డలను


అబార్షన్ ద్వారా హత్య చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో ఆడబిడ్డల సంఖ్య పెంచే విధంగా ప్రజల్లో విశృత అవగాహన  అవసరమని, భారతదేశములో మొదటి సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలను ప్రారంభించిన శ్రీరాజారామ్మోహన్ రాయ్ 22-05-1772 బెంగాల్ లో జన్మించారని, భారతదేశములో  సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలను ప్రారంభించిన గొప్ప సంఘసంస్కర్తని, సాంఘిక దురాచారమైన సతీ సహగమనాన్ని రూపుమాపడానికి కృషిచేశారని,  వితంతు, పునర్వివాహానికి మద్దతుపలికి, స్త్రీ విద్యకై పాటుపడి, బ్రహ్మసమాజాన్ని స్థాపించి, బహుభార్యత్వము, మూఢనమ్మకాల పై ప్రజలను చైతన్య పరిచి 27-09-1833 స్వర్గస్తులైనారని స్మరించుకుంటూ చిత్ర పటానికి పూలమాల వేసి ఘణనివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల లెక్షరర్స్ చైతన్య, మహేంద్ర, రాజు, హుశేన్,   విధ్యార్థులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: