యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి,.... 

ఉపాధి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి

సిపిఎం పార్టీ డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలంలోని ఓర్వకల్లు, శకునాల,నన్నూరు, దొడ్డిపల్లె,మీదివేముల, బ్రాహ్మణపల్లె గ్రామాలలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నాగన్న,మండల నాయకులు చంద్రబాబు నాయుడు,మధుసూదన్, సుధాకర్ ల ఆధ్వర్యంలో గ్రామ సచివాలయాల ముందు నిరసన తెలియజేసి, సచివాలయ సిబ్బందికి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై విపరీతమైన బారాలు మోపుతూ పెట్రోల్,డీజిల్, గ్యాస్,నిత్యవసర సరుకులు మరియు సర్ చార్జీల పేరుతో విద్యుత్ చార్జీలను పెంచుతూ ప్రజలపై అధిక భారం మోపుతున్నారని,


కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను అమలు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏ రాష్ట్రాలు చేయకపోయినా మొట్టమొదట ఏపీ రాష్ట్రంలోనే అమలవుతున్నాయని, రైతుల మోటార్లకు మీటర్లను బిగించే విధానం, చెత్త పన్ను రూపంలో ప్రజల వద్ద అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయడం, ఇండ్లకు కూడా స్మార్ట్ మీటర్లు పెట్టడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యారని, రాష్ట్ర ప్రజానీకం, రైతులు, కార్మికులు, యువకులు కేంద్ర రాష్ట్ర  ప్రభుత్వ విధానాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని, వర్షాలు కురువక రైతులు, వ్యవసాయ కూలీలు పనులు లేక అల్లాడుతున్నారని, ఉపాధి పెండింగ్ బిల్లును తక్షణమే విడుదల చేసి పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మానుకుని ప్రజలకు అనుకూలమైన విధి విధానాలను అవలంబించి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను అదుపు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, లేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో వ్యవసాయ కార్మికసంఘం నాయకులు చాంద్ భాషా, రామస్వామి, డివైఎఫ్ఐ నాయకులు మహేష్, మాసంభాష, ఆకులమధు, శ్రీరాములు, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: