''ఆడుదాం ఆంధ్ర" క్రీడా సంబరాలను విజయవంతం చేద్దాం...

జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలో "ఆడుదాం ఆంధ్ర" క్రీడా సంబరాలను విజయవంతం చేసేందుకు పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని ఆ మేరకు సిద్ధం కావాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి ఆర్గనైజింగ్ కమిటీలను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో "ఆడుదాం ఆంధ్ర" క్రీడా సంబరాలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్షేత్రాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ


గ్రామీణ ప్రాంతాలలో క్రీడా సంస్కృతిని పెంపొందించాలన్న ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరు 2 వ తేదీ నుండి నవంబర్ 8 వ తేదీ వరకు ''ఆడుదాం ఆంధ్ర'' పేరిట క్రీడా పోటీలు నిర్వహించనుందన్నారు. క్రికెట్, బాడ్మింటన్, వాలీబాల్, కోకో, కబడ్డి వంటి క్రీడలతో పాటు ఇతర సాంప్రదాయ గ్రామీణ క్రీడలను కూడా మిళితం చేసి పోటీలు నిర్వహించాలన్నారు. ఈ పోటీలలో 15 సంవత్సరాలు నిండిన యువతను భాగస్వామ్యం చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఈ క్రీడల్లో పాల్గొనకూడదని, ఆర్గనైజర్లుగా మాత్రమే వ్యవహరించాలని తెలిపారు. ఈ క్రీడా పోటీలకు సన్నద్ధమయ్యేందుకు పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని, సంబంధించిన ఏర్పాటు చేసి జిల్లా స్థాయి నుండి మండల స్థాయి వరకు కమిటీలు "ఆడుదాం ఆంధ్ర" క్రీడా పోటీల నిర్వహణకు అవసరమైన క్రీడా మైదానాలు, పిఈటిలు, పిడిఎస్, ఎంపైర్లను గుర్తించాలని, సచివాలయాల స్థాయి నుంచి మండల, అసెంబ్లీ నియోజకవర్గ,జిల్లా స్థాయి వరకు వరకూ "ఆడుదాం ఆంధ్ర" క్రీడా పోటీలను నిర్వహించాలని, గ్రామ స్థాయి నుండి యువత భారీ ఎత్తున భాగస్వాములు అయ్యే విధంగా ప్రోత్సాహించాలని, గ్రామ స్థాయిలో యువజన సంఘాలను భాగస్వాములను చేసే విధంగా అదికారులు ప్రత్యేక చొరవ చూపించాలని, అవసరం అయితే జిల్లా స్దాయిలో ఉన్న అదికారులు గ్రామాల్లో పర్యటించి క్రీడలకు ఉన్న ప్రాధాన్యతను వివరించి అవగాహనా కార్యక్రమాలను రూపొందించాలని, అక్టోబర్ 2 నుండి 7 వరకు గ్రామవార్డు స్థాయిల్లో,10 నుండి19 వరకు మండల స్థాయిల్లో,22 నుండి 25 వరకు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిల్లో, 28 నుండి 31 వరకు జిల్లా స్థాయిలో, నవంబర్ 4 నుండి 7వ తేదీ వరకు రాష్ట్రస్థాయిలో"ఆడుదాం ఆంధ్ర"క్రీడా పోటీలు నిర్వహించాలని ప్రభుత్వం షెడ్యూల్ ను జారీ చేసిందని, క్రీడలకు సంబంధించిన కిట్లను ప్రభుత్వమే సరఫరా చేస్తుందని, క్రీడలకు అనువైన మైదానాలు, క్రీడా మైదానాలు, పిఈటిలు, పిడిఎస్, ఎంపైర్లను గుర్తించాలని డీఈవో సుధాకర్ రెడ్డిని ఆదేశించారు. క్రీడా ప్రదేశాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు ఓఆర్ యస్ ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లను, ఏఎన్ఎం, ఆశా వర్కర్లను ఏర్పాటు చేసుకోవాలని డిఎంహెచ్వో ను ఆదేశించారు. క్రీడా ప్రదేశాల్లో మంచినీటి వసతి, ఆహార పదార్థాల ఏర్పాటుకు ఆర్డబ్ల్యూఎస్, సివిల్ సప్లై,మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్రీడాకారులకు సంబంధించి టిషర్ట్స్, షాట్స్, క్యాప్స్, బ్యానర్స్ ఏర్పాట్లకు సంబంధించి దాతల నుండి ఫండ్స్ సేకరణకు చర్యలు తీసుకోవాలని సిపిఓ ను ఆదేశించారు. సమావేశానికి గైరు హాజరైన ఆర్ఐఓ, డివిఈఓ, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్,ట్రైబల్ వెల్ఫేర్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జేసీ డిఎస్డిఓను ఆదేశించారు. ఈ సమావేశంలో సెట్కూర్ సీఈఓ రమణ, క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్య శిక్షకుడు రాజు, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవి చంద్రారెడ్డి, సిపిఓవేణుగోపాల్, డిఆర్డిఎ పిడి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: