ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది ఆలయ సమీపంలో ఎలుగుబంటి సంచారం
అప్రమత్తమైన స్థానికులు, ఆలయసిబ్బంది
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది ఆలయ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున ఎలుగుబంటి సంచరించినట్టు స్థానికులు తెలిపిన సమాచారం మేరకు అప్రమత్తమైన ఆలయసిబ్బంది,స్థానికుల సహాయంతో దానిని పారద్రోలే ప్రయత్నం చేయగా ఆలయ సమీపంలోని ఒక వసతి గృహానికి పక్కన ఉన్న పంట పొలాల్లోకి వెళ్ళిందని,
ఆలయ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుందన్న విషయాన్ని భక్తులకు తెలిపి అప్రమత్తం చేశామని, ఎలుగుబంటి ఆలయ సమీప ప్రాంతాల్లో సంచరిస్తున్న విషయాన్ని అటవిశాఖ ఆధికారులకు సమాచారం అందించామని ఆలయసిబ్బంది తెలిపారు.
Post A Comment:
0 comments: