బస్సుయాత్ర ముగింపు సభను జయప్రదం చేయండి... సిపిఐ నాయకుల పిలుపు

 బస్సుయాత్ర ముగింపు సభను జయప్రదం చేయండి

సిపిఐ నాయకుల పిలుపు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

"రాష్ట్రాన్ని రక్షించండి దేశాన్ని కాపాడండి"అనే నినాదముతో రాష్ట్రంలోని 26 జిల్లాలలో పర్యటించి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి చైతన్య పరుస్తూ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త బస్సుజాత 08-09-23 వతేదీ తిరుపతిలో జరుగుతున్న ముగింపు బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యాలయంలో వాల్ పోస్టర్లును విడుదల చేశారు. ఈసందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు మాట్లాడుతూ దేశంలో నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేసే విధానాన్ని దేశ ప్రజలందరూ వ్యతిరేకించాలని,దేశంలో నిత్యావసర ధరలు పెరిగి  పేద ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాటిని పట్టించుకోక మతోన్మాదంతో దేశ ప్రజల మధ్య ఐక్యతను కాలరాసే ప్రయత్నం చేస్తున్న మోడీ, అమిత్ షా ప్రయత్నాలను తరిమికొట్టి దేశాన్ని కాపాడాలని, రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుండి నేటి వరకు ఏ పాలకులు చేయని లక్షల కోట్లు అప్పులు రాష్ట్ర ప్రభుత్వం చేయడం ప్రజలందరూ గమనిస్తున్నారని, ప్రజా వ్యతిరేక  నిర్ణయాలను చేస్తున్న జగన్మోహన్ రెడ్డి నుండి రాష్ట్రాన్ని రక్షించాలని, కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న విధివిధానాలను


సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో 26 జిల్లాలోనూ ప్రకటించి ప్రజలను సమ్యేక్యపరిచి 08-09-24 వ తేదీన తిరుపతి నగరంలో ముగింపు భారీ బహిరంగసభ జరగనున్నదని, ఈసభకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ రాజా, సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు నాగేశ్వరరావు, సత్యనారాయణ మూర్తి, సిపిఐ జాతీయ రాష్ట్ర నాయకులు పాల్గొంటారని నంద్యాల జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు, రైతులు బహిరంగ సభను జయప్రదం చేసేందుకు కదం తొక్కుతూ కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, సహాయ కార్యదర్శి బాబా ఫకృద్దీన్, జిల్లా కార్యవర్గ సభ్యులు సుంకయ్య, మోటారాముడు, సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్, సహాయ కార్యదర్శి సోమన్న, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సుబ్బరాయుడు,  ఏఐటీయుసీ కార్యదర్శి శ్రీనివాసులు, ఏఐఎస్ఎఫ్ జిల్లాకార్యదర్శి ధనుంజయుడు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: