భక్తులను ఆకట్టుకుంటున్న,,,, బాలగంజ్ కాళింగ మర్దన విఘ్నేశ్వరుడు

 భక్తులను ఆకట్టుకుంటున్న,,,,

బాలగంజ్ కాళింగ మర్దన విఘ్నేశ్వరుడు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

పాత నగరం లాల్ దర్వాజా బాలాగంజ్ లో ఏర్పాటుచేసిన కాళింగ మర్దన విఘ్నేశ్వరుని మండపంలో  గణపతి నవరాత్రి ఉత్సవ వేడుకలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. పాత నగరం మొత్తంలో అత్యంత ఎత్తైన 21  అడుగుల కాళింగ మర్దన రూపంలో ఉన్న సుందర విఘ్నేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు వేరువేరు ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివస్తున్నారు.  దశాబ్దాల తరబడి నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్టు బాలాగంజ్ యువసేన ప్రతినిధులు తెలియజేశారు.  దేశభక్తి ఆధ్యాత్మిక భావన పెంపొందించే లక్ష్యంతో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సాయంత్రం వేళలా సాంస్కృతిక సంగీత కార్యక్రమాలను భజన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు వారు వివరించారు. పాత నగరం మొత్తంలో బాలాగం విఘ్నేశ్వరుని మండపం అగ్రస్థానంలో నిలుస్తుందని బాల గణేష్ యువసేన సలహాదారు మురళీకృష్ణ తెలియజేశారు.



Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: