అధిక వడ్డీలను వసూలు చేస్తున్న ఫైనాన్స్ కంపెనీలపై.... కాల్ మనీ కేసులు నమోదు చేయాలి.... సిపిఐ నాయకులు డిమాండ్

 అధిక వడ్డీలను వసూలు చేస్తున్న ఫైనాన్స్ కంపెనీలపై....

కాల్ మనీ కేసులు నమోదు చేయాలి.... 

సిపిఐ నాయకులు డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్థానిక నంద్యాల పట్టణంలో ఉన్న శ్రీరామ ఫైనాన్స్, చోళ ఫైనాన్స్,బజాజ్ ఫైనాన్స్ వార్ల ఏజెంట్లు ప్రజలను వేధించి వారు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితికి తీసుకురావడం జరుగుతుందని అందులో భాగంగానే మహానంది మండలంలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడడం విచారకరమని దౌర్జనలకు పాల్పడుతూ వారిని వేధిస్తున్న వారిపై పోలీస్ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు సిపిఐ జిల్లా సహా య కార్యదర్శి ఎస్ బాబా ఫకృద్దీన్,సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ లు పోలీసు యంత్రాంగాన్ని  డిమాండ్ చేశారు.  నంద్యాల జిల్లాలో శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్,చోళ ఫైనాన్స్ లాంటి అనేక ఫైనాన్స్ కంపెనీలు ప్రజలకు అతి తక్కువ వడ్డీలతో రుణాలు ఇస్తామని మభ్యపెట్టి ప్రజలకు వారి అవసరాలకు రుణాలు ఇచ్చి,రుణాలు తీసుకున్న ప్రజలతో చెప్పేదొకటి చేసేది ఒకటి అనే విధంగా వారిని అధిక వడ్డీలు కట్టాలని చెప్పి వేధించి రుణాలు తీసుకున్న వారి ఇండ్ల వద్దకు వచ్చి మహిళలని చూడకుండా వారి కుటుంబ సభ్యులను బెదిరించి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని,రుణాలు ఇచ్చిన ఫైనాన్స్ వారికి సంబంధించిన వారు రుణాలు తీసుకున్న వారి ఫోన్లకు  ఏదో ఒక ఫోను నెంబర్ ద్వారా ఫోన్ చేసి చెప్పుకోలేని విధంగా విధంగా నానాబూతులు తిట్టి కోర్టుల ద్వారా మీ ఆస్తులను జప్తు చేస్తామని బెదిరించడం వల్ల అధిక వడ్డీలు కట్టలేక రుణాలు తీసుకున్న వారు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు  జరుగుతున్నాయని, నంద్యాల జిల్లాలలో ఉన్న ఇలాంటి ఫైనాన్స్ కంపెనీల వారిపై కాల్ మనీ కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: