"బాబు షూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ"
భారీ బహిరంగ సభను,,,,
విజయవంతం చేయాలి
టిడిపి శ్రేణులను కోరిన...నంద్యాల టిడిపి ఇన్చార్జి భూమా బ్రహ్మానంద రెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లాలో"బాబు షూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ" కార్యక్రమంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి,టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారని, ఈ సందర్భంగా రాజ్ థియేటర్ సర్కిల్ నందు భారీ బహిరంగ సభ నిర్వహించాలని నంద్యాల నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ భూమా బ్రహ్మానందరెడ్డి నివాసంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. "బాబు ష్యురిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ" కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నంద్యాలకు విచ్చేస్తున్న నేపథ్యంలో నంద్యాల పట్టణంలోని రాజ్ థియేటర్ సర్కిల్ నందు బహిరంగ సభను ఏర్పాటు చేశామని పర్యటన ఇంచార్జ్ ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎన్.ఎమ్.డి ఫరూక్, మాజీ శాసన సభ సభ్యులు భూమా బ్రహ్మానంద రెడ్డి, నంద్యాల నియోజకవర్గం టీడీపీ పరిశీలకులు పోతురాజు రవి కుమార్, నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గౌడ్, విత్తనాభివృద్ది శాఖ మాజీ ఛైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి, లాయర్ రామచంద్రరావు టిడిపి రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు ముస్తాక్ మౌలానా అహమ్మద్ తో కలిసి బహిరంగ సభ జరిగే స్థలాన్ని పరిశీలించామని, 08-09-23 వతేదీ సాయంత్రం 05:00 గంటలకు రాజ్ థియేటర్ సర్కిల్ నందు "బాబు ష్యురిటీ-భవిష్యత్తు కు గ్యారెంటీ" బహిరంగ సభ ఉంటుందని, నంద్యాలలో నిర్వహించే భారీ బహిరంగ సభకు టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు టిడిపి శ్రేణులు అందరూ కదిలి వచ్చి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.
Post A Comment:
0 comments: