విద్యార్థిని విద్యార్థులకు ఉత్తమ క్రమశిక్షణ,విద్య అందించే,,,, ప్రతి ఉపాధ్యాయి ని,ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులే.... గడివేముల ఎంఈఓ విమల వసుంధర దేవి

 విద్యార్థిని విద్యార్థులకు ఉత్తమ క్రమశిక్షణ,విద్య అందించే,,,,

ప్రతి ఉపాధ్యాయి ని,ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులే.... 

గడివేముల ఎంఈఓ విమల వసుంధర దేవి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలంలోని స్థానిక ఎంఈఓ కార్యాలయంలో జరిగిన మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమాన్ని గడివేముల ఎంఈఓ విమల వసుంధర దేవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గడివేముల జడ్పిటిసి ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమ సమాజ స్థాపకులని,శిలను శిల్పంగా మారుస్తారని, ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్న వారందరూ, ఉపాధ్యాయుల చేత రూపుదిద్దుకున్న వారేనని, తెలిపారు.గడివేముల ఎంఈఓ విమల వసుంధర దేవి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదని, ప్రతి విద్యార్థిని విద్యార్థులను తమ సొంత పిల్లల కన్నా మిన్నగా పాఠశాలల యందు చూసుకుంటూ క్రమశిక్షణతో విద్యాబోధన చేసి దేశానికి ఉత్తమ పౌరులుగా అందించడానికి అనునిత్యం శ్రమించి వారిని తీర్చిదిద్దేది కేవలం ఒక గురువుకు మాత్రమే సాధ్యమని,


విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులందరూ ఉత్తమ ఉపాధ్యాయులేని,అందరూ సన్మానానికి అర్హులేనని తెలిపారు.అనంతరం మండలంలోని ఉత్తమ ఉపాధ్యాయులు ఎన్నికైన సన్మాన గ్రహీతలు హేమలత ఎంపియుపిఎస్ బిలకలగూడురు,శ్రీమతి జీనత్ జహాన్ ఎంపీపీఎస్ ఉర్దూ గని,శ్రీమతి విజయ కుమారి ఎంపీ యుపిఎస్ మంచాలకట్ట,శ్రీమతి శ్యామల, ఎంపియుపిఎస్ బిలకల గూడూరు, పద్మిని ఎంపిపిఎస్ కరిమద్దుల, ఎల్లనాగిరెడ్డి ఎంపీపీఎస్ గని, అబ్దుల్ రవూఫ్ ఎంపీపీఎస్ సోమాపురం, ఉమామహేశ్వర్ రెడ్డి ఎంపీపీ ఎస్ ఆళ్లగడ్డ, తమను ఎంపిక చేసినందుకు గడివేముల మండల ఎంఈఓ విమల వసుంధర దేవికి మరియు మండలంలోని ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు నరసింహులు, వెంకటసుబ్బయ్య, చంద్రశేఖర్ ఆచారి, పుల్లయ్య, ఒబయ్యా పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: