నాడు-నేడు క్రింద చేపట్టిన పనులకు ఎక్స్పెండేచర్ బుక్ చేయండి..... అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్

 నాడు-నేడు క్రింద చేపట్టిన పనులకు ఎక్స్పెండేచర్ బుక్ చేయండి

అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ 

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

రెండవ విడత మన బడి నాడు-నేడు పథకం కింద పెండింగ్లో ఉన్న పనులు ఈ నెలాఖరులో పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీర్లు, ఎంఈఓలను జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎక్స్పెండిచర్ బుకింగ్, గ్రాస్ ఎన్రోల్మెంట్ సర్వే పై మండలాల వారిగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ రెండవ విడత నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో పనులు చేపట్టి పెండింగ్లో ఉన్న పనులను ఈ నెలాఖరులోగా పూర్తి పూర్తిచేయాలని ఎంఈఓ, సంబంధిత ఇంజినీర్లను ఆదేశించారు. ప్రతి మండలంలో ఖచ్చితంగా 4 పాఠశాలల్లో అన్ని పనులు పూర్తిస్థాయిలో పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని,


నాడు-నేడు కింద పూర్తయిన పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపు నిమిత్తం  ఎక్స్పెండేచర్ బుక్ చేయాలని, నాడు-నేడు పనులకు సంబంధించి 4 కోట్ల రూపాయలు అకౌంట్లో ఉన్నాయని, నిల్వ వున్న నిధులు ఖర్చు చేసేందుకు బిల్లులను సమర్పించాలని, నంద్యాలజిల్లాలో గ్రాస్ ఎన్రోల్మెంట్ సర్వే బడి ఈడు పిల్లల నమోదుకు సంబంధించి పెండింగ్లో ఉన్న 2700 మంది పిల్లల వివరాల సర్వేను రెండు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈవో సుధాకర్ రెడ్డి,సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారి లలిత తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: