చేతి వృత్తుల పని వారికి ఉచితంగా పని ముట్లు పంపిణి

నంద్యాల పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సి. శ్రీనివాస యాదవ్

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో సాంప్రదాయ కుల వృత్తిదారులు, హస్త కళాకారుల వ్యాపారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకానికి శ్రీకారం చుట్టిందని నంద్యాల పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీనివాస యాదవ్ తెలిపారు. విశ్వకర్మ యోజన మీటింగ్ ద్వారా ఈ పథకం అమలుకు సంబంధించి జిల్లా స్థాయి అమలు కమిటీ అధికారులతో అవగాహన సమావేశం నిర్వహించి అమలు తీరుపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సెప్టెంబర్ 17 న ప్రారంభించే ఈ పథకంపై పెద్దఎత్తున అవగాహన కల్పించేందుకు గ్రామస్థాయి నుంచి చర్యలు తీసుకోవాలనిఆదేశించారు. ఈ పథకంపై గ్రామ,వార్డు సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు, స్వయం సహాయక సంఘాలు, బ్యాంకర్లకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవడంతోపాటు లబ్ధిదారులు ఆన్లైన్లో నమోదుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. 18 రకాల వృత్తి,హస్త కళాకారుల్లో లబ్దిదారులను గుర్తించాల్సివుందని, లబ్ధిదారుల నమోదు ప్రక్రియపై వాలంటీర్లకు శిక్షణ నివ్వాలని, నైపుణ్య కేంద్రాలనూ గుర్తించాల్సిందిగా సూచించారు. ఈపథకం కింద తొలిదశలో అర్హులైన 18ఏళ్లునిండిన సాంప్రదాయ కులచేతి వృత్తిదారులను, కళాకారులను గుర్తించాలని లబ్ధిదారుల ఆన్లైన్ లో ఎన్రోల్మెంట్ ను కంప్యూటర్ సర్వీస్ సెంటర్స్ ద్వారా నమోదు చేసుకొని, వెరిఫికేషన్ చేయాలని, వడ్రంగి, పడవల తయారీ, కవచతయారీ, కమ్మరవారు కమ్మరసాధనం, పనిముట్టు, తాళాలతయారీ దారులు, శిల్పి, వెండి, బంగారం మొదలైన లోహాలతో ఆభరణాలు చేయు స్వర్ణ శిల్పి, కుమ్మరి, చెప్పులు కుట్టు వారు, తాపీ మేస్త్రీ, బుట్టల తయారీ, బొమ్మల తయారి, పూల మాలలు అల్లేవారు, డాభా, దర్జీలు, చేపల వలలు తయారీ మొదలగు వృత్తుల వారిని గుర్తించాలన్నారు. ఆన్లైన్ దరఖస్తూ చేసుకొనుటకు సమీపములోని గ్రామ సచివాలయము మరియు వార్డు సచివాలయమును సంప్రదించాలని మరింత సమాచారాము కొరకు నంద్యాలజిల్లా పరిశ్రమల కేంద్రం ఇండోర్ స్టేడియం పద్మావతి నగర్ లో ఉన్న కార్యాలయాన్ని సంప్రదించాలని, ఈపథకానికి 18 రకాల చేతివృత్తి దారులు అర్హులవుతారని, అర్హులకు సర్టిఫికేట్, గుర్తింపుకార్డు, 3 లక్షల వరకు హామీ లేని ఋణం, 15 వేల  విలువ గల ఉచితంగా పని ముట్లు పంపిణీ చేస్తామని తెలిపారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: