నాటు సారా స్థావరాలపై విస్తృత దాడులు నిర్వహించిన.... నంద్యాలజిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ఇంటలిజెన్స్ అదికారులు

 నాటు సారా స్థావరాలపై విస్తృత దాడులు నిర్వహించిన....

నంద్యాలజిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ఇంటలిజెన్స్  అదికారులు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి (ఐపీఎస్) ఆదేశాల మేరకు నంద్యాల అడిషనల్ ఎస్పీ జీ. వెంకటరాముడు పర్యవేక్షణలో నంద్యాల జిల్లా ఇంటలిజెన్స్ టీమ్ అబ్ధుల్ ముజీబ్, అశ్వత్ రెడ్డి, సుధాకర్ రెడ్డి ఎస్బిఐ సిబ్బంది శ్రీలక్ష్మి , ఫరూక్, పద్మనాభం ఫైజుల్ భీ అధ్యక్షతన నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని శ్రీ దుర్గభోగేశ్వరం గ్రామ పరిసర ప్రాంతాల్లో నాటు సారాయి బట్టీలు పెట్టి సారాయి తయారు చేస్తున్నారని తెలుసుకున్న సమాచారం మేరకు నంద్యాల జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇంటలిజెన్స్ అధికారులు దాడులు చేసి నాటు సారాయి బట్టీని(డిస్టిలేషన్ పాయింట్లను),


నాటు సారాయికి ఉపయోగించిన సామాగ్రి డ్రమ్‌లను,1400  లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారాయి తయారు చేసి విక్రయించాలని సారాయి బట్టీలను ఏర్పాటు చేసుకున్న ఇద్దరు మహిళలను గుర్తించామని, దుర్వేసి గ్రామానికి చెందిన ఈరమ్మ (45)ను అదుపులోకి తీసుకోగా,దుర్వేసి గ్రామానికి చెందిన 
సరస్వతి అను మహిళ పారిపోవడం జరిగిందని, దుర్వేసి గ్రామానికి చెందిన సరస్వతి అనే మహిళను త్వరలోనేపట్టుకుంటామని, నంద్యాల జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వారిని ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తెలిపారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: