జగనన్నకు చెబుదాం - స్పందన ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపండి... సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లాకలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్

 జగనన్నకు చెబుదాం - స్పందన ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపండి

సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లాకలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాలలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జగనన్నకు చెబుదాం - స్పందన ఫిర్యాదులపై వెంటనే స్పందించి అర్జీదారులు సంతృప్తి చెందేస్థాయిలో నిర్ధేశిత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ సంబంధిత అధికారులకుఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం - స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి అర్జీదారులు సంతృప్తి చెందేస్థాయిలో నిర్ధేశిత గడువులోగా వేగవంతంగా పరిష్కరించాలని అధికారులనుసూచించారు. జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో ఈకేవైసీకి సంబంధించి పెండింగ్ లో వున్న 2764 దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని, గ్రామాల్లో త్రాగునీటి సరఫరా,డ్రైనేజీ కాలువల్లో చెత్తా చెదారం తొలగింపు,పారిశుధ్య నివారణ తదితర అంశాల్లో  ఈఓఆర్డీలకు బాధ్యతలు అప్పగించి బాధ్యులను చేయాలని కలెక్టర్ డిపిఓను ఆదేశించి,పెండింగ్ లో ఉన్న 900 మంది పిల్లల గ్రాస్ ఎండోమెంట్ సర్వే మూడు రోజుల్లో కంప్లీట్ చేయాలని విద్యాశాఖ అధికారులు కలెక్టర్ ఆదేశించి,ప్రజా విజ్ఞప్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ జరిపి పరిష్కరించాలని, అర్జీదారులు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కరించక పోతే మళ్లీ రీఓపెన్ అయ్యే అవకాశముందని, జగనన్నకు చెబుదాం ఆడిట్ లో ప్రజలు అసంతృప్తి  చెందిన కేసులు,


రీఓపెన్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టికి సారించి పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు.జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎపి సేవా సర్వీసులకు 1664 దరఖాస్తులు బియాండ్ ఎస్ఎల్ఏ పెండింగ్ లో ఉన్నాయని,2 రోజుల్లో పూర్తి చేయాలని ఆర్డీఓలు, తాసీల్ధార్లను ఆదేశించారు. రీఓపెన్ కేసులకు సంబంధించిన 43 దరఖాస్తులు వెంటనే క్లియర్ చేయాలన్నారు. స్పందన  కార్యక్రమంలో కలెక్టరుతోపాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి,డిఆర్ఓ పుల్లయ్య తదితర జిల్లాధికారులు ప్రజల నుండి వచ్చిన138 మంది అర్జీదారుల ఫిర్యాదులనుస్వీకరించారు. ఈస్పందన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూఅధికారి పుల్లయ్య,జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి మరియు నంద్యాల జిల్లాఆధికారులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: