వర్షాల కారణంగా విద్యుత్ వినియోగంపై అప్రమత్తంగా ఉండండి.... గడివేముల మండల విద్యుత్ శాఖ ఏఈ ఖలీల్ పాష

 వర్షాల కారణంగా విద్యుత్ వినియోగంపై అప్రమత్తంగా ఉండండి

గడివేముల మండల విద్యుత్ శాఖ ఏఈ ఖలీల్ పాష

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

వర్షాల కారణంగా విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని గడివేముల మండల విద్యుత్ శాఖ ఏఈ ఖలీల్ పాష అన్నారు.ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఏఈ ఖలీల్ పాష మాట్లాడుతూ గడివేముల మండలంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేని వర్షాల కారణంగా మీ దగ్గరలో కాని,మీ ఇంటిలో కాని ఎలాంటి విద్యుత్ పరికరాలను ఆరుబయట కరెంటు స్తంభాలను,తడి చేతితో తాకవద్దని,ఈ వర్షాల దాటికి విద్యుత్ స్తంభాలు విరిగిపడే అవకాశం ఉందని,రైతులు వర్షాల వల్ల పంటపొలాల్లో విద్యుత్‌ మోటార్లు నీటిలో మునిగి ఉంటాయని, స్టార్టర్‌ బాక్సులు తడిసి ఉంటాయని,రైతు సోదరులు వాటిని ముట్టుకునే ప్రయత్నం చేయరాదని, పశువులను మేపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని,విద్యుత్ స్తంభాలకు కట్టరాదని, ఇంట్లో బట్టలను అరేసుకోవడానికి విద్యుత్తు తీగలను వాడరాదని, ఉరుములు, పిడుగులు సంభవించినప్పుడు విద్యుత్ లైన్స్ క్రింద ఉండరాదని,మీ కనుచూపు మేర ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడిన వెంటనే మీ ఏరియా కరెంటు ఆఫీసుకి కాని,మీ యొక్క లైన్ మెన్ కు సమాచారం అందించి ప్రమాదాలను నివారించేందుకు సహకరించాలని,అప్రమత్తంగా లేకపోతే విద్యుదాఘాతానికి గురయ్యే ప్రమాదం ఉందని,విద్యుత్తు సమస్యలుంటే వెంటనే సంబంధిత సిబ్బంది దృష్టికి తీసుకురావాలని గడివేముల మండల విద్యుత్ శాఖ ఏఈ ఖలీల్ పాష విజ్ఞప్తి చేశారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: