చంద్రబాబు అరెస్ట్ అక్రమం, అన్యాయం..... టిడిపి నాయకుల ఆగ్రహం

 చంద్రబాబు అరెస్ట్ అక్రమం, అన్యాయం 

టిడిపి నాయకుల ఆగ్రహం

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబునాయుడు అరెస్టుఅన్యాయం, అక్రమమని నంద్యాల జిల్లాలోని రహదారులపై బైఠాయించి టిడిపి నాయకులు, కార్యకర్తలు,అభిమానులు చంద్రబాబు అరెస్టును ముక్తకంఠంతో ఖండించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ కేవలం తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి నాయకులపై దాడులు చేయడం, తప్పుడు కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారిందని ఆరోపించారు.


చంద్రబాబుకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి వైకాపా నాయకులు, సీఎం జగన్ తట్టుకోలేకపోతున్నారని, చంద్రబాబు పర్యటనలతో జగన్ కు కంటిమీద కునుకు కరువైందన్నారు. చంద్రబాబు వంటి సీనియర్ నాయకుడిని అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందని, 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎక్కడికైనా పారిపోతాడా... అర్ధరాత్రి వచ్చి పోలీసులు అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. తాను తప్పు చేస్తే బహిరంగంగా ఉరి  తీయండి అన్న చంద్రబాబుకు ఇంకా నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు, రానున్న రోజుల్లో వైసిపి ప్రభుత్వం తప్పక మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. అక్రమ కేసు అరెస్టుకు నిరసనగా రాష్ట్రంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుకు అండగా ఉండాలని,

భయబ్రాంతులకు గురి చేస్తే ఇక్కడ భయపడడానికి ఎవరు సిద్ధంగా లేరని, రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబును గెలిపించుకోవాలని టిడిపి నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లాలోని టిడిపి మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలోపాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: