కళాశాలకు మంజురైన నాడు-నేడు పథకం నిధులపై క్షేత్రస్థాయి విచారణ జరిపించాలని..
. జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన..పాణ్యం ఏఐఎఫ్బి నాయకులు వనం వెంకటాద్రి
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరమ్మత్తుల కోసం నాడు-నేడు పథకం కింద మంజూరైన1 కోటి 25 లక్షల రూపాయలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలానిసమాన్ గారికి వినతి పత్రాన్ని అందజేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో టి.చంద్రయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల 1981 సంవత్సరంలో ఏర్పడిందని,కళాశాల ఏర్పడి 42 సంవత్సరాలు అయ్యిందని,కళాశాలలో తరగతి గదుల పైకప్పుల పెచ్చులు వూడి విద్యార్థుల మీద పడుతున్నాయని,గత ఆరు సంవత్సరాలు నుండి విద్యార్థి,ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు నిరసన దీక్షలు చేస్తూన్నమని,
నంద్యాల జిల్లా ఏర్పాటు తర్వాత టీ. చంద్రయ్య ప్రభుత్వ జూనియర్ కాలేజీ మరమ్మత్తుల కొరకు నాడు- నేడు పథకం కింద ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు విడుదల అయ్యాయని, ప్రస్తుతం పని చేస్తున్న ప్రిన్సిపాల్ కమిటీమెం బర్లను బెదిరించి సంతకాలు తీసుకొని కళాశాల తరగతిగతులను మరమ్మతులు చేయకుండానే తరగతి గదులకు మరమ్మతులు చేశామని డబ్బులు అయిపోయాయని చెబుతున్నారని, విద్యార్థులకు టాయిలెట్, బెంచీలు,డిజిటల్ టీవీ, ఫ్యాన్లు,ఎలాంటి మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా, కళాశాల ప్రిన్సిపల్ కు మాత్రం ఏమాత్రం చీమకుట్టినట్లు కూడా లేదని అందుకే స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానిసమున్ గారికి వినతిపత్రం అందజేసి క్షేత్రస్థాయిలో పాణ్యం ప్రభుత్వ జూనియర్ కళాశాలపై విచారణ జరిపించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్.మనజీర్ జిలాని సమన్ గారికి వినతి పత్రాన్ని అందజేశామని పాణ్యం మండలం ఏఐఎఫ్బి నాయకులు వెంకటాద్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో పాణ్యం మండల ఏఐఎఫ్బి నాయకులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: