విధులను ఉల్లంఘిస్తున్న
ఓర్వకల్లు మండల విద్యాశాఖ అధికారిని పై చర్యలు తీసుకోవాలి...
రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్,ప్రగతిశీల స్టూడెంట్స్ యూనియన్ నాయకుల డిమాండ్
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా వర్గం ఓర్వకల్లు మండల కేంద్రంలో ఉన్న బుగ్గరామేశ్వర డిగ్రీ కళాశాలలో రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్.(అర్విఎఫ్ ) ప్రగతిశీల స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాయలసీమ రవీంద్రనాథ్, అయ్యన్న లు మాట్లాడుతూ ఓర్వకల్లు మండలంలో విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాల్సి విద్యాశాఖ అధికారులే టీచర్లపై ఒత్తిడి తీసుకురావడం దేశం లో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నిస్తూ,విద్యాశాఖ అధికారి తన అటెండెన్స్ ఎంపీడీవో ఆఫీసులో లేదా ఫేస్ యాప్ ద్వారా లేదా మండల వనరుల కేంద్రంలో అయినా నమోదు చేయాలని అలా కాకుండా మండల విద్యాశాఖ అధికారి అటెండెన్స్ ఎక్కడ వేస్తున్నారో చెప్పాలని, ఆఫీసులో ఒకరోజు కూడా కనపడకుండా వారం రోజుల అటెండెన్స్ ఒకే రోజు వేసుకోవడం,పది రోజుల సంతకాలను ఒకేరోజు పెట్టు కోవడం చేస్తున్నారని,భవిత కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో ఉండాల్సిన కంప్యూటర్లు తన సొంత ఇంటి దగ్గర పెట్టుకోవడం హేమమైన చర్యని,ప్రభుత్వ ఉద్యోగుల టీచర్స్ జీతాలు చెల్లించాలంటే మామూలు ఇవ్వాల్సిందేనని,మిడ్ డే మీల్స్ ఏజెన్సీ వర్కర్ల నుండి కూడా అక్రమ వసూలు చేస్తున్నారని, మెడికల్ లీవ్ పెట్టుకున్నా మెడికల్ లీవులకు సెపరేట్ మామూలుఇవ్వాల్సిందేనని ప్రభుత్వ టీచర్లను భయభ్రాంతులకు గురి చేస్తూన్నారని,ఓర్వకల్లు మండల విద్యాశాఖ అధికారి గతంలో పనిచేసిన కౌతళంమండలంలో కూడా ఇదే ఆరోపణలు వచ్చాయని అక్కడ కూడా ఇదే నిర్వహణ చేసి రెండు సార్లు సస్పెండ్ అయ్యారని, మళ్లీ ఓర్వకల్లు మండలంలో పునరావృతం చేయడం జరిగిందని, తక్షణమే ఓర్వకల్లు మండల విద్యాశాఖ అధికారిపై ఉన్నత విద్యాధికారులుచర్యలు తీసుకోని విధుల నుండి తొలగించాలని విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నామని,ఉన్నత విద్యాధికారులు చర్యలు తీసుకోలేని పక్షంలో ఉద్యమాలను ఉదృతం చేసి చరవాణి ద్వారా ఆర్జెడి గారికి విన్నవించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు మహేష్,రామ్,విష్ణు,మధు, వెంకటేష్ మరియు రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ ప్రగతిశీల యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
విధులను ఉల్లంఘిస్తున్న
ఓర్వకల్లు మండల విద్యాశాఖ అధికారిని పై చర్యలు తీసుకోవాలి...
రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్,ప్రగతిశీల స్టూడెంట్స్ యూనియన్ నాయకుల
Post A Comment:
0 comments: