"బాబుష్యూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ" బహిరంగ సభకు,,,
టిడిపి శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చిన.....గౌరు దంపతులు
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా పాణ్యం వర్గం కర్నూలు పట్టణంలోని మాధవి నగర్ లో ఉన్న గౌరు దంపతుల స్వగృహం నందు ఏర్పాటు చేసిన టిడిపి శ్రేణుల సమావేశానికి ముఖ్య అతిథులుగా టీడీపీ సీనియర్ నాయకులు గౌరు వెంకటరెడ్డి హాజరయ్యారు, ఈ సందర్భంగా గౌరు దంపతులు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి,టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు పాణ్యం నియోజకవర్గ మాజీ శాసనసభ సభ్యురాలు, టిడిపి ఇన్చార్జి గౌరు చరిత రెడ్డి ఆధ్వర్యంలో పాణ్యం నియోజకవర్గంలో 09-09-23(శనివారం)వతేదీన చెన్నమ్మ సర్కిల్ నందు సాయంకాలం 5:00 గంటలకు"బాబు షూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ" కార్యక్రమంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు భారీ బహిరంగసభను నిర్వహిస్తున్న సందర్భంగా పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు, ఓర్వకల్లు, గడివేముల, పాణ్యం మండలాలు మరియు కల్లూరు అర్బన్ పరిధిలోని 16 వార్డులో ఇన్చార్జిలు, టిడిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, టిడిపి శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని గౌరు దంపతులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాణ్యo నియోజకవర్గ అబ్జర్వర్ కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా, మాజి మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ రామకృష్ణ, నన్నురు విశ్వేశ్వరరెడ్డి, ఓర్వకల్లు, పాణ్యం మండల అధ్యక్షుల్లు జయరామిరెడ్డి, గోవింద్ రెడ్డి, అర్బన్ వార్డ్ ఇంచార్జిలు, టిడిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.
"బాబుష్యూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ" బహిరంగ సభకు,,,
టిడిపి శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చిన.....గౌరు దంపతులు
Post A Comment:
0 comments: