అతిసార వ్యాధి పై తక్షణ చర్యలు తీసుకోండి
వైద్య సిబ్బందిని ఆదేశించిన..... నందికొట్కూరు శాసనసభ సభ్యులు ఆర్థర్
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలంలోని బీరవోలు గ్రామంలో అతిసార వ్యాధి లక్షణాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిసిన వెంటనే పగిడ్యాల మండల కేంద్రము లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను నందికొట్కూరు శాసనసభ సభ్యులు ఆర్థర్ గారు సందర్శించి చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, ప్రజల ఆరోగ్య స్థితిగతులపై వైద్యులతో మాట్లాడి, ప్రజల ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మాట్లాడుతూ ప్రజలు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని,అతి సారా వ్యాధికిగల కారణాలను తెలుసుకొని వాటిని పరిష్కరించే మార్గాలను అన్వేషించాలని సంబంధిత అధికారులకు నందికొట్కూరు శాసనసభ్యులు తొగురు ఆర్థర్ ఆదేశాలు జారీ చేశారు.
ఈకార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ శ్రీమతి గంగిరెడ్డి రమాదేవి,ఉండవల్లి ధర్మారెడ్డి,పాలమర్రి జీవన్ సుందర్ రాజు,ఉదయ్ కిరణ్ రెడ్డి,లక్ష్మాపురం భూషి గౌడ్,బీరవొలు తిరుపాలు,మహేష్,మండల అభివృద్ధి అధికారి వెంకట రమణ,డిప్యూటీ తహసిల్దార్,ఏఈ,ఆర్డబ్ల్యూఎస్,పంచాయతీ సెక్రెటరీ, వైద్య సిబ్బంది మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
అతిసార వ్యాధి పై తక్షణ చర్యలు తీసుకోండి...
వైద్య సిబ్బందిని ఆదేశించిన..... నందికొట్కూరు శాసనసభ సభ్యులు ఆర్థర్
Post A Comment:
0 comments: