జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై విస్తృత అవగాహన కల్పించండి
రాష్ట్రప్రభుత్వ ప్రధానకారదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రవేశపెడుతున్న“జగనన్న ఆరోగ్య సురక్ష" కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కారదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి సంబంధిత కార్యదర్శులతో కలిసి ఏపీ సెక్రటేరియట్ నుండి వర్చువల్ విధానంలో సుస్థిర అభివృద్ధిలక్ష్యాలు, జగనన్న ఆరోగ్య సురక్ష, గ్రామవార్డు సచివాలయాల సేవలు, ఐసిడిఎస్ పథకాలు, జగనన్నకు చెబుదాం తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డా. కే ఏస్ జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కారదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ 15-10-23 వ తేదీ నుండి ప్రభుత్వం నిర్వహించనున్న జగనన్న ఆరోగ్య సురక్ష" కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్నిజిల్లాల కలెక్టర్లకు సూచించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ప్రగతిలో వందశాతం ఫలితాలను సాధించాలని తెలిపారు. కలెక్టర్ ఛాంబర్ నుంచి జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి,
జిల్లాధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జగనన్న ఆరోగ్యసురక్ష కార్యక్రమాన్ని లైన్ డిపార్టుమెంట్ల అధికారులు అందరూ సమన్వయంతో వ్యవహరిస్తూ ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని,15-09-23 నుండి వాలంటీర్ల ద్వారా ఇంటింటి ప్రచారం నిర్వహించాలని, జిల్లాలో 11 గ్రామాల్లో నీరు కలుషితమవుతున్నట్లు సర్వేలో వెల్లడైందని, జిల్లా పంచాయతీ అధికారి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, వైద్యాధికారులు సమన్వయం చేసుకొని అతిసారా,సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్.మనజీర్ జిలాని సమన్ ఆదేశించారు.
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై విస్తృత అవగాహన కల్పించండి....
రాష్ట్రప్రభుత్వ ప్రధానకారదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి
Post A Comment:
0 comments: