ప్రజల వినతులకు తక్షణ పరిష్కారం చూపండి.., మండలస్థాయిస్పందనలో..... నంద్యాలజిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్

 ప్రజల వినతులకు తక్షణ పరిష్కారం చూపండి..,

మండలస్థాయిస్పందనలో..... నంద్యాలజిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలో మండల స్థాయిలో పరిష్కరించే చిన్న చిన్న సమస్యలు సైతం కలెక్టరేట్ కు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మండల స్థాయిలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించాలని సూచించిందని,స్వీకరించిన వినతులపై ప్రత్యేక దృష్టి సారించి నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ అధికారులను ఆదేశించారు. గోస్పాడు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జగనన్నకు చెబుదాం - స్పందన కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ తో పాటు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ పుల్లయ్య, జిల్లా అధికారులు ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం - స్పందన కార్యక్రమం ద్వారా మండల స్థాయిలో పరిష్కరించే ప్రజా ఫిర్యాదులకు మరింత మెరుగైన సర్వీసులు అందించాలని అధికారులకు సూచించారు. సాధ్యమైనంతవరకు స్వీకరించిన దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించి అర్జీదారుల్లో సంతృప్త స్థాయిని పెంచాలన్నారు.


మంచినీటి వసతి కల్పించాలని, కాలువలలో పూడిక తీయడం లేదని, పారిశుధ్య చర్యలు చేపట్టాలని చిన్న చిన్న సమస్యలను మండల స్థాయి అధికారులే పరిష్కరించాలని, అర్జీదారులు కలెక్టరేట్‌కు వచ్చే వ్యయప్రయాసలు తగ్గించేందుకు ప్రభుత్వం మండల స్థాయిలో స్పందన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు మరింత చేరువులో మెరుగైన సర్వీసులందించేందుకు కృషి చేయాలని సూచించిందని,మండల స్థాయి స్పందన కార్యక్రమంలో 29 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కు అర్జీలు సమర్పించారని, ఈ సమస్యలన్నీ వితిన్ ఎస్ఎల్ఏ లోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాపరిషత్ డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి, మండల అధ్యక్షులు సైమాన్, ఎంపీడీవోభాస్కర్, తాసిల్దార్ విజయశేఖర్ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: