జగనన్న లేఔట్లలో ఆర్చీలు, గృహనిర్మాణాలు, ఈ క్రాఫ్ట్ బుకింగ్,,,,, 

ఈకేవైసీ నిర్దేశిత గడువులోపు పూర్తి చేయండి

అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలో జరుగుతున్న జగనన్న లేఔట్లలో గృహ నిర్మాణాలతో పాటు ఆర్చీలు,ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణాల పనులు లక్ష్యం మేరకు నిర్దేశిత గడువు లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్.జవహర్ రెడ్డి సంబంధిత కార్యదర్శులతో కలిసి ఏపీ సెక్రటేరియట్ నుండి వర్చువల్ విధానంలో రెవెన్యూ అంశాలైన రీసర్వే,4జి టవర్స్, జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ, జగనన్నకు చెబుదాం, వ్యవసాయ శాఖ,మిల్లెట్ ప్రోత్సాహకం, జగనన్న పాలవెల్లువ, పశు సంవర్దక శాఖ, పంచాయితీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ కింద ప్రాధాన్యతా భవనాల పురోగతి,


మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జెసిలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షనిర్వహించారు. కలెక్టర్ ఛాంబర్ నుంచి జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్,జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ పుల్లయ్య వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. సిఎస్ విసి అనంతరం జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలు వేసుకునేలా ప్రోత్సహించాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. సాగు చేసిన పంటలకు ఈనెల 15 లోపు ఈక్రాఫ్ బుకింగ్ తో పాటు ఈకేవైసీ పూర్తి చేయాలన్నారు. జగనన్న లేఔట్లలో లక్ష్యం మేరకు గృహ నిర్మాణాలు పూర్తి చేయడంతో పాటు ఆర్చీల నిర్మాణాలు పూర్తి కావాలని కలెక్టర్ హౌసింగ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణాల పనులు కూడ నిర్దేశిత గడువు లోపు పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ అధికారులను ఆదేశించారు. రీ సర్వే గ్రామాల్లో నిర్దేశించబడిన లక్ష్యాలను క్షేత్ర స్థాయి గ్రౌండ్ ట్రూతింగ్, విలేజ్ సర్వేయర్ లాగిన్, తహసీల్దార్ లాగిన్,ఫైనల్ ఆర్ఓఆర్, రాళ్ళు నాటే కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేలా ప్రణాళికా బద్ధంగా అధికారులు పని చేయాలని సూచించారు. స్పందన అర్జీలను, జగనన్నకు చెబుదాం రెవెన్యూ గ్రీవెన్స్ అర్జీలను సకాలంలో బియాండ్ ఎస్ఎల్ఏ లో వెళ్లకుండా నాణ్యతగా,అర్జీదారుని సంతృప్తి మేరకు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: