ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన జిల్లా కో-ఆపరేటివ్ అధికారి వెంకటసుబ్బయ్య.... అభినందనలు తెలిపిన నంద్యాల జిల్లా రెడ్ క్రాస్

 ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ప్రధాన కార్యదర్శిగా

ఎన్నికైన జిల్లా కో-ఆపరేటివ్ అధికారి వెంకటసుబ్బయ్య....

అభినందనలు తెలిపిన నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ సభ్యులు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

రెడ్ క్రాస్ సేవలను మారుమూల ప్రాంతాలకు మరింతగా విస్తృత పరచాలనే లక్ష్యంతో రెడ్ క్రాస్ రాష్ట్ర ప్రెసిడెంట్ గవర్నర్ గారి సూచన మేరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా ప్రెసిడెంట్, కలెక్టర్ డాక్టర్.మనజీర్ జిలాని సమన్ కోపరేటివ్ సొసైటీస్ జిల్లా అధికారి వెంకటసుబ్బయ్యను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా బ్రాంచ్ కి ప్రధాన కార్యదర్శిగా నియమించిన సందర్భంగా నంద్యాల రెడ్ క్రాస్ సభ్యులు వెంకటసుబ్బయ్యను దుశ్యాలువాతో సన్మానించి పుష్పగుచ్చాన్ని రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్ల అందించారు. 


ఈ  సందర్భంగా వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు మరియు రెడ్ క్రాస్ సభ్యుల అందరి సహకారంతో నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్.మనజీర్ జిలాని సమన్ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలో రెడ్ క్రాస్ అభివృద్ధికి, మారుమూల ప్రాంతాలలో సైతం రెడ్ క్రాస్ సేవలు అందించడానికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.  ఈ సన్మాన కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా కోశాధికారి నాగేశ్వరరావు, నంద్యాల మండలం అధ్యక్షులు నాగేశ్వర్ రెడ్డి,  ఉపాధ్యక్షుడు సోహెల్,  రెడ్ క్రాస్ డిఎఫ్ఓ రాజునాయక్ లు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: