ప్రభుత్వ ఆసుపత్రులలోనే కాన్పులు జరిగేలా చర్యలు తీసుకోండి.. వైద్యాధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్

 ప్రభుత్వ ఆసుపత్రులలోనే కాన్పులు జరిగేలా చర్యలు తీసుకోండి

వైద్యాధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా  ప్రతినిధి)

నంద్యాల జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు ప్రభుత్వ ఆసుపత్రిలలోనే గర్భిణీ స్త్రీలు జన్మనిచ్చేలా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ వైద్యాధికారులను ఆదేశించారు. నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లాకలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు ప్రభుత్వ ఆసుపత్రులలో లక్ష్యం మేరకు ప్రసవాలు జరిగేలా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వైద్య ఉన్నతాధికారులను,వైద్య సిబ్బందిని ఆదేశించారు. పిహెచ్సీ లలో కాన్పులు కష్టమై సిజరిన్ చేసే పరిస్థితులు ఏర్పడితే సమీప సిహెచ్సి లు, ఏరియా ఆసుపత్రులకు పంపాలని,పేద ప్రజలు అనవసరంగా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బు వృధా చేసుకోకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని గర్భిణీ స్త్రీలలో అవగాహన కల్పించడంతో పాటు హైరిస్క్ గర్భిణీ స్త్రీలను గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే డెలివరీలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఏఎన్ఎం, ఆశావర్కర్లు మరియు వైద్య సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య నిమిత్తం నిర్దేశించిన నెలవారీ లక్ష్యాలను ఖచ్చితంగా సాధించాలని,


డోన్,బనగానపల్లిలో వంద పడకల ఆసుపత్రి స్థాయికి చేరుకున్న నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాలను పిహెచ్సిలను అనుసంధానం చేసి రోగులకు మెరుగైన వైద్యసేవలుఅందించాలని, కలెక్టర్ డాక్టర్.మనజీర్ జిలాని సమన్ వైద్యాధికారులను మరియు  సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డా.వెంకటరమణ, డిసిహెచ్ఎస్ కోఆర్డినేటర్ డా.జఫ్రూళ్ల, జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.వరప్రసాద్, ఆరోగ్యశ్రీ డిస్టిక్ కోఆర్డినేటర్ రూపేంద్ర నాథ్ రెడ్డి లు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: