గడివేముల మండలంలో.... ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు

 గడివేముల మండలంలో....

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండలంలోని ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయ దినోత్సవంలో భాగంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన గావించి పూలమాలవేసి నివాళులర్పించి గురువు యొక్క ప్రాముఖ్యతను గురుపూజోత్సవం యొక్క విశిష్టత గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరిస్తూ, మన దేశానికి రాష్ట్రపతిగా సేవలందించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తి నుంచి ఆయన రాష్ట్రపతిగా ఎదిగిన విషయాన్ని, పట్టుదల కృషి వల్లనే అంతటి మహోన్నతమైన పదవులను అలంకరించారని,


  ఆయన మన దేశానికి అందించిన సేవలను విద్యార్థిని విద్యార్థులందరికీ విషధికరించి వివరించారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులందరికీ శాలువాలతో సన్మానించి మెమొంటో అందించి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గడివేముల మండలంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయినీ , ఉపాధ్యాయులు, విద్యార్థినివిద్యార్థులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: