మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేసిన.....

ఏపీ బిల్డింగ్ మరియూ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ)

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం బేతంచర్ల పట్టణంలో ఏపీ భవన నిర్మాణ మరియు ఇతర భవన నిర్మాణ కార్మికులు యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ సంక్షేమ బోర్డును కాపాడాలని,సంక్షేమ బోర్డులో నుండి వాడుకున్న1280 కోట్ల రూపాయలు డబ్బులను భవన నిర్మాణ సంక్షేమబోర్డు లోనే జమ చేయాలనీ,భవననిర్మాణ కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించి, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేసి,పెండింగ్ లో ఉన్న క్లైమ్లను వెంటనే విడుదల చేయాలని కోరుతూ బేతంచెర్ల పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 


ఇంటి ముందు ధర్నా నిర్వహించిన అనంతరం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి భవన నిర్మాణాల కార్మికులు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు.  అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు భవన నిర్మాణ నాయకులతో మాట్లాడుతూ త్వరలోనే భువన కార్మికుల సమస్యలు అన్ని తీరిపోతాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బేతంచెర్ల ఏపీ భవన మరియు ఇతర భవన నిర్మాణ కార్మికుల యూనియన్ సిఐటియు నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: