రైతులకు 9 గంటల కరెంటును ఇవ్వాలి
బీఎస్పీ పార్టీ డిమాండ్
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాలజిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పరిధిలోని పాములపాడు విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రైతులకు తొమ్మిది గంటలు నాణ్యమైన కరెంటును సప్లై చేసి రైతులను ఆదుకోవాలని బిఎస్పి పార్టీ నందికొట్కూరు అసెంబ్లీ ఇన్చార్జి స్వాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తు రైతులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో వర్షాలు పడక పంటలకు సరైన వర్షపాతం నమోదు కాక వేసిన పంటలు ఎండిపోయి రైతులు విలవిలలాడుతున్నారని, ఒకవైపు బోరు బావుల కింద సాగు చేసిన పంటలకు కరెంటు కోతలతో బోరు బావుల క్రింద సైతం పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరేత్తి నట్టు వ్యవహరిస్తుందని,
రైతులకు పగటిపూట తొమ్మిది గంటల కరెంటు సరఫరా చేసి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించి రైతు రుణమాఫీ చేసి కొత్త రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈధర్నా కార్యక్రమంలో పాములపాడు మండల రైతు సోదరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: