తొలగించిన ఓట్ల పునః పరిశీలన ఈ నెల 7 వతేది లోపు పూర్తి చేయండి

అధికారులను ఆదేశించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

విజయవాడలోని ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఓటర్ల జాబితాలో తొలగించిన ఓట్లకు సంబంధించి పునః పరిశీలన 07-09-23 వతేది నాటికి పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులకు సూచించారు.అన్ని జిల్లాల కలెక్టర్ లు, జేసిలతో ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల అంశాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ


ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి మార్పులు, చేర్పులు మరియు కొత్తగా నమోదైన ఓటర్ ల వివరాలన్నింటినీ 25-09-23 లోపు పూర్తి చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. పెండింగ్ లో ఉన్న ఇంటింటి సర్వే, జంక్ క్యారెక్టర్స్ ను సవరించి, పరిష్కరించే వాటికి సంబంధించి కొన్ని జిల్లాలో పెండింగ్ లో ఉన్నాయని, పెండింగ్ లో ఉన్న వాటిని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, ఏపీక్ కార్డు ప్రతినెల 15 రోజులకు ఒకసారి జనరేట్ చేయాలని, ఎన్నికలకు సంబంధించి పనుల్లో ఆలస్యం లేకుండా చూసుకోవాలని,06-01-2022 నుండి 31-03-2023 వరకు తొలగించిన ఓట్లకు సంబంధించి పునఃపరిశీలన  07-09-23 వతేది నాటికి పూర్తి చేయాలని, రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్లకు సంబందించిన పనులు పెండింగ్ లేకుండా చూసుకోవాలని,

ఎఫ్ఎల్సి వర్క్‌షాప్ 15-09-23 వతేదీన విజయవాడలో ఎన్నికలసంఘం నిర్వహిస్తుందని, కలెక్టర్, ఒక సీనియర్ అధికారి, ఎఫ్ఎల్సి సూపర్‌వైజర్‌గా నియమించడం జరుగుతుందని, సంబంధిత సమావేశానికి కలెక్టర్లు, ఎఫ్ఎల్సి, సూపర్‌వైజర్‌లు తప్పక హాజరు కావాలని తెలిపారు.ఈ వీడియోకాన్ఫరెన్స్ కార్యక్రమంలో నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లాకలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్, డిఆర్ఓ పుల్లయ్య, నియోజకవర్గ స్పెషల్ అధికారులు, ఎన్నికల విభాగపు అధికారులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: