సెప్టెంబర్ 10 ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం,,, అవగాహన సదస్సు నిర్వహించిన....డాక్టర్ సహదేవుడు, డాక్టర్ ఆరిఫా భాను

 సెప్టెంబర్ 10 ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం,,,

అవగాహన సదస్సు నిర్వహించిన....డాక్టర్ సహదేవుడు, డాక్టర్ ఆరిఫా భాను

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి) 

నంద్యాల జిల్లాలో సెప్టెంబర్ 10 ప్రపంచ ఆత్మహత్యల నివారణ అవగాహన దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీ రామకృష్ణ పిజి కళాశాల ఆడిటోరియం నందు ఏర్పాటుచేసిన సమావేశంలో సీనియర్ వైద్యులు డాక్టర్ జి సహదేవుడు, ప్రముఖ మానసిక వైద్యురాలు డాక్టర్ అరిఫా బాను ముఖ్య అతిథులుగా పాల్గొని మానవ జీవితం యొక్క ఆవశ్యకత గురించి ఆత్మహత్యలను ఎలా నివారించాలనే విషయాల గురించి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. విద్యార్థులను ఉద్దేశించి డా.ఆరిఫా భాను మాట్లాడుతూ నిరాశ మరియు భ్రమలకు చాలా పరిష్కారాలు ఉన్నాయని, ఆత్మహత్య చేసుకోవడం కంటే వాటిని పరిష్కరించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని, విద్యార్థులు డిప్రెషన్‌లో ఉన్న స్నేహితులు గురించి తెలుసుకుని వారికి సాధ్యమైనంత వరకు పరిష్కారం మార్గాలు చూపాలని, డిప్రెషన్ గురించి స్క్రిజోఫినియా గురించి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. డోపమిన్ లాంటి హార్మోన్స్ లోపాల వల్ల కూడా ఇలాంటి ఆలోచనలు కలిగే అవకాశం ఉందని కావున మన స్నేహితులలో బంధువులలో ఏకాంతంగా గడిపే వారిని తమలో తాము కుమిలిపోయే వారిని గ్రహించి తగిన వైద్యం అందిస్తే నష్టం నివారించడానికి అవకాశం ఉంటుందనని తెలిపారు.


డా.గేలివి సహదేవుడు మాట్లాడారు. శ్రీరాముడు, వివేకానంద లాంటి వారిని ఉదాహరణలుగా తీసుకొని వారు చాలా సమస్యలను ఎదుర్కొన్నారు. కానీ ఆత్మహత్య చేసుకోలేదని, ఏదైనా తమకు దక్కుతుందని తెలిసినప్పుడు అది దక్కక పోయినప్పుడు ఇలాంటి వాటికి ఆత్మహత్యలకు పాల్పడుతుంటారని, ఉదయమే పట్టాభిషేకం అని తెలిసి అడవులకు వెళ్లవలసి వచ్చిన శ్రీరామచంద్రుడు ఆ రోజుల్లోనే వెళ్లి మనకు ఆత్మస్థైర్యం ఏంటో తెలిపాడని, పురాణ పురుషులు, చరిత్రకారులు స్వతంత్ర సమరయోధులు అంగవైకల్యం ఉండి కూడా ఎన్నో విజయాలు సాధించారని, వారిని చూసి మనంస్ఫూర్తి పొందాలి గాని ఆత్మహత్యకు పాల్పడకూడదని తెలిపారు. ఈకార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల, శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల మేనేజర్ ప్రగతి రెడ్డి,సీనియర్ లెక్చరర్ శ్రావణి , మాస్టర్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ హలిమ, రెడ్ క్రాస్ డిఎఫ్ఓ రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: