సెప్టెంబర్ 2023

 రైతన్నల శ్రేయస్సు కోరేదే వైసిపి ప్రభుత్వం

పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాలజిల్లా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని ఓర్వకల్లు మండలంలో ప్రభుత్వ రాయితీపై పప్పు శెనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి పాణ్యం ఎమ్యెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ముఖ్య అతిథిలుగా పాల్గొని విత్తనాలను పంపిణీ చేశారు.అనంతరం పాణ్యంఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ రైతుల మీద జగనన్న చూపిస్తున్న ప్రేమ మళ్ళీ రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేస్తుందని, వైయస్సార్సీపి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతుల మీద దివంగత నేత, ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న ప్రేమను మరువకుండా తనయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  రైతు సోదరుల మీద చూపిస్తున్నారని,


రైతు సోదరులు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నమ్మిన వ్యక్తిని తెలిపారు. ఈకార్యక్రమంలో ఓర్వకల్ మండల ZPTC రంగనాథ్ గౌడ్, MPP తిప్పన్న, ఓర్వకల్ సింగిల్ విండో ప్రెసిడెంట్ నాగ తిరుపాల్, వైఎస్సార్ సీపీ నాయకులు పెద్ద స్వామి, కర్నూలు డి.ఏ.ఏ.బి చైర్మన్ మహేశ్వర రెడ్డి, ఓర్వకల్లు మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీ లు, వైఎస్సార్ సీపీ నాయకులు, వ్యవసాయ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

 వైఎస్సార్‌ వాహన మిత్ర పధకం కింద లబ్ధిదారులకు చెక్కును పంపిణీ చేసిన...

నంద్యాలజిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

 నంద్యాల జిల్లాలో వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం కింద నంద్యాల జిల్లాలో 8892 మంది లబ్ధిదారులకు 8 కోట్ల 89 లక్షల 20 వేల రూపాయలు పంపిణీ చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ తెలిపారు. నంద్యాల జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్రముఖ్యమంత్రి విజయవాడలోని విద్యాధరపురం నుండి వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం క్రింద రాష్ట్రవ్యాప్తంగా 2,75,931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 10,000/-  రూపాయల చొప్పున 275.93 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే కారక్రమాన్ని లైవ్ ద్వారా జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్,ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, మైనారిటీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారుడు డీఎస్ హాబీబుల్లా,రాష్ట్ర దృశ్య కళల డైరెక్టర్ సునీత అమృత రాజ్,జిల్లా రవాణా అధికారి శివారెడ్డి తదితరులు వీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ  జిల్లాలోని ఆటో, ట్యాక్సీ, ఎండియూ ఆపరేటర్లు, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు ప్రభుత్వం అండగా ఉంటూ ఇన్సూరెన్స్ వాహనాలకు అవసరమైన రిపేర్లు చేయించుకునేందుకు వైయస్సార్ వాహన మిత్ర పథకం కింద వరుసగా ఐదో ఏడాది మొత్తం 8892 మంది లబ్ధిదారులకు 8 కోట్ల 89 లక్షల 20 వేల రూపాయలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశారని తెలిపారు. నియోజకవర్గాల వివరాలు తెలుపుతూ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 1194 లబ్ధిదారులకు 1,19,40,000/-, బనగానపల్లె నియోజకవర్గంలో 1074 లబ్ధిదారులకు 1,07,40,000/-,డోన్ నిజకవర్గంలో 1221 డబ్బు దారులకు 1,22,10,000/-, నందికొట్కూరు నియోజకవర్గంలో 1565 లబ్ధిదారులకు 1,56,50,000/-,


నంద్యాల నియోజకవర్గంలో 1862 లబ్ధిదారులకు 1,86,20,000/-,పాణ్యం నియోజకవర్గంలో 554 లబ్ధిదారులకు 55,40,000/-,శ్రీశైలం నియోజకవర్గంలో 1422 లబ్ధిదారులకు 1,42,20,000/-, మొత్తం 8892 మంది లబ్ధిదారులకు 8,89,20,000/- రూపాయిలు జమ చేసేమని తెలిపారు. అనంతరం ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి ,ఎమ్మెల్సీ ఇషాక్ బాషా లు మాట్లాడుతూ పార్టీలకతీతంగా అర్హత మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంతరం ప్రజల రవాణా సౌకర్యాల్లో ఇబ్బందులు పడకుండా ప్రజల సౌకర్యార్థం కోసం శ్రమించే ఆటో,ట్యాక్సీ, మ్యాక్సీ డ్రైవర్లు ఇబ్బందులు పడకూడదనే ప్రధాన ఉద్దేశంతో ప్రతి సంవత్సరం డ్రైవర్లకు 10,000/- ఇవ్వడం హర్షించదగ్గ విషయమని, సొంత వాహనం కలిగి వున్న ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం హర్షించదగ్గ విషయమనీ, పార్టీలకతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల లబ్ది చేకూర్చడమే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయమని,ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు విడతల్లో ఆటో ట్యాక్సీ, మ్యాక్సీ డ్రైవర్లకు 1301.89 కోట్ల రూపాయలను వాహన మిత్ర పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించిందని తెలిపిన అనంతరం నంద్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి వచ్చిన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లు, ఎండియూ ఆపరేటర్లకు 8,89,20,000 రూపాయల మెగా చెక్కును పంపిణీ చేశారు.

 ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో.... 

హెల్త్ కార్డులు పంపిణీ చేసిన... కౌన్సిలర్ నాగిని రవి సింగారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలోని స్థానిక నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 36 వ వార్డులో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా 72 మంది కి హెల్త్ కార్డులను కౌన్సిలర్ నాగిని రవి సింగారెడ్డి పంపిణీ చేశారు. ఈసందర్భంగా 36 వ వార్డు కౌన్సిలర్ నాగిని రవి సింగారెడ్డి మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు వల్ల పేదవారు ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం ఈకార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా రాష్ట్రంలో మాత్రమే ఆరోగ్యశ్రీ ద్వారా చేయించుకోవడానికి వీలు అవుతుందని,కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ హెల్త్ కార్డును దేశంలో ఉన్న నిర్ధేశిత జాబితాలో


ఉన్న ఆసుపత్రులలో పైసా ఖర్చు లేకుండా ఎక్కడైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చూపించుకోవడానికి వీలుగా ఉంటుందని వివరిస్తూ ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ద్వారా 36 వ వార్డులో ఆర్థికంగా  నిరుపేదలైన 72 మందికి హెల్త్ కార్డులను పంపిణీ చేసి అర్హులైన ప్రతి ఒక్కరు నిర్ధేశిత హాస్పిటల్స్ నందు ఈ కార్డును ఉపయోగించుకోవచ్చని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మంది పేదవారికి నాణ్యమైన ఆరోగ్యసేవలందిస్తున్నారని,కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలో ఎక్కడైనా నిర్ధేశిత జాబితాలో ఉన్న హాస్పిటల్ నందు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఇస్తున్న కార్డును ఉపయోగించుకోవచ్చునని తెలిపారు.ఈకార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వాలంటరీలు మరియు ప్రజలు పాల్గొన్నారు.

 అధిక వడ్డీలను వసూలు చేస్తున్న ఫైనాన్స్ కంపెనీలపై....

కాల్ మనీ కేసులు నమోదు చేయాలి.... 

సిపిఐ నాయకులు డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్థానిక నంద్యాల పట్టణంలో ఉన్న శ్రీరామ ఫైనాన్స్, చోళ ఫైనాన్స్,బజాజ్ ఫైనాన్స్ వార్ల ఏజెంట్లు ప్రజలను వేధించి వారు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితికి తీసుకురావడం జరుగుతుందని అందులో భాగంగానే మహానంది మండలంలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడడం విచారకరమని దౌర్జనలకు పాల్పడుతూ వారిని వేధిస్తున్న వారిపై పోలీస్ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు సిపిఐ జిల్లా సహా య కార్యదర్శి ఎస్ బాబా ఫకృద్దీన్,సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ లు పోలీసు యంత్రాంగాన్ని  డిమాండ్ చేశారు.  నంద్యాల జిల్లాలో శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్,చోళ ఫైనాన్స్ లాంటి అనేక ఫైనాన్స్ కంపెనీలు ప్రజలకు అతి తక్కువ వడ్డీలతో రుణాలు ఇస్తామని మభ్యపెట్టి ప్రజలకు వారి అవసరాలకు రుణాలు ఇచ్చి,రుణాలు తీసుకున్న ప్రజలతో చెప్పేదొకటి చేసేది ఒకటి అనే విధంగా వారిని అధిక వడ్డీలు కట్టాలని చెప్పి వేధించి రుణాలు తీసుకున్న వారి ఇండ్ల వద్దకు వచ్చి మహిళలని చూడకుండా వారి కుటుంబ సభ్యులను బెదిరించి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని,రుణాలు ఇచ్చిన ఫైనాన్స్ వారికి సంబంధించిన వారు రుణాలు తీసుకున్న వారి ఫోన్లకు  ఏదో ఒక ఫోను నెంబర్ ద్వారా ఫోన్ చేసి చెప్పుకోలేని విధంగా విధంగా నానాబూతులు తిట్టి కోర్టుల ద్వారా మీ ఆస్తులను జప్తు చేస్తామని బెదిరించడం వల్ల అధిక వడ్డీలు కట్టలేక రుణాలు తీసుకున్న వారు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు  జరుగుతున్నాయని, నంద్యాల జిల్లాలలో ఉన్న ఇలాంటి ఫైనాన్స్ కంపెనీల వారిపై కాల్ మనీ కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

 భ్రూణ హత్యలు నివారించడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

బేతంచెర్ల పాణ్యం సిమెంట్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బాలకృష్ణ,

సామాజిక కార్యకర్త మహమ్మద్ రఫీ

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాబనగానపల్లె నియోజకవర్గం బేతంచెర్ల పట్టణంలోని పాణ్యం సిమెంట్ జూనియర్ కళాశాలలోభారతదేశములో మొదటి గొప్ప సంఘ సంస్కర్త  శ్రీరాజారామ్మోహన్ రాయ్ వర్ధంతి సందర్బంగా  పీఎన్‌డీటీ(గర్భస్థ పిండ పరీక్ష నివారణ) చట్టంపై విద్యార్థులకు అవగాహణ సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మనదేశంలో గణాంకాలను పరిశీలిస్తే ఆడపిల్లల నిష్పత్తి గణనీయంగా తగ్గుతున్నదని, కాలానుగుణంగా దంపతులు మగపిల్లాడు పుడితే బాగుంటుందని భావించడం వల్లే ఆడపిల్లల భ్రూణ హత్యలు జరుగుతున్న కారణంగా నివారించేందుకు ప్రభుత్వం 1994లో పిసి పీఎన్‌డీటీ (గర్భస్థ పిండ పరీక్ష నివారణ) చట్టాన్ని తీసుకొచ్చిందని, ఈ చట్టంపై పూర్తిస్థాయిలో  అవగాహన అవసరమని, సమాజంలో ఆడ మగ ఇద్దరూ  సమానమేనని, లింగ వివక్ష చూపడం సరికాదని, ఆడపిల్లలను పుట్టనిద్దాం,  పెరగనిద్దాం, చదవనిద్దామని, (PC - PNDT ) ప్రీ-కాన్సెప్షన్ మరియు ప్రీ-నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ 1994 భారతదేశంలో ఆడబిడ్డల భ్రూణహత్యలను ఆపడానికి, భారతదేశంలో క్షీణిస్తున్న లింగనిష్పత్తిని అరికట్టడానికి రూపొందించబడిన భారత  పార్లమెంటు చట్టమని, ప్రస్తుత సమాజంలో బాలికల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో లింగనిర్ధారణ, నివారణ చట్టంపై మరియు  గర్భస్థ పిండంగా ఉండగానే ఆడబిడ్డలను


అబార్షన్ ద్వారా హత్య చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో ఆడబిడ్డల సంఖ్య పెంచే విధంగా ప్రజల్లో విశృత అవగాహన  అవసరమని, భారతదేశములో మొదటి సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలను ప్రారంభించిన శ్రీరాజారామ్మోహన్ రాయ్ 22-05-1772 బెంగాల్ లో జన్మించారని, భారతదేశములో  సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలను ప్రారంభించిన గొప్ప సంఘసంస్కర్తని, సాంఘిక దురాచారమైన సతీ సహగమనాన్ని రూపుమాపడానికి కృషిచేశారని,  వితంతు, పునర్వివాహానికి మద్దతుపలికి, స్త్రీ విద్యకై పాటుపడి, బ్రహ్మసమాజాన్ని స్థాపించి, బహుభార్యత్వము, మూఢనమ్మకాల పై ప్రజలను చైతన్య పరిచి 27-09-1833 స్వర్గస్తులైనారని స్మరించుకుంటూ చిత్ర పటానికి పూలమాల వేసి ఘణనివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల లెక్షరర్స్ చైతన్య, మహేంద్ర, రాజు, హుశేన్,   విధ్యార్థులు పాల్గొన్నారు.

 గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన,,,

హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేందర్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

హైదరాబాద్ నగరంలో గణేష్ మండపాలలో భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. నిమర్జనం చివరి రోజు దగ్గరపడటంతో భక్తులు తాకిడి మరింత పెరిగింది. ఇదిలావుంటే గాంధీ బజార్లో నవ యువ గణేష్ మండపంలో ప్రతిష్టించిన గణనాధునికి హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేందర్ రెడ్డి, మాజీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అశోక చక్రవర్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జిత్తు. ధీరజ్ దీపక్ సోని జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు.  

 టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని కోరుతూ.... 

బిఎస్పి పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ముట్టడి

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

టీఎస్పీఎస్సీ బోర్డు ను రద్దు చేయాలని కోరుతూ బహుజన సమాజ్ పార్టీ నాయకులు సోమవారం హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ముట్టడించారు. కార్యాలయం గేటు ముందు బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. బిఎస్పి నాయకులు నినాదాలు చేస్తూ అలజడి సృష్టించారు. దీంతో ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు.  అరెస్టు అయిన వారిలో జిల్లా ఇన్ చార్జీ  ఎ.అంజయ్య, జిల్లా అధ్యక్షులు చాట్ల చిరంజీవి, ఆర్.సునీల్, పి.శైలజ, ఏ.నాగరాజు,  చార్మినార్ అద్యక్షులు రామ్ చరణ్ దాస్, రమేష్, ప్రసన్న యాదవ్ తదితరులు ఉన్నారు.

 

 విద్యార్థులు చదువు తో పాటు  క్రీడల్లో రాణించాలి

హైదరాబాద్ బీజేపీ  ఎస్సి మోర్చ నగర మాజీ కార్యదర్శి కాటేపాగ అనిల్ 

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

శ్రీ సుభాష్  చంద్రబోస్ గణేష్ ఉత్సవ సమితి ముక్కెర బస్తీ ఉప్పు గూడ లో ఏర్పాటు చేసిన గణనాథుని హైదరాబాద్ బీజేపీ  ఎస్సి మోర్చ నగర మాజీ కార్యదర్శి కాటేపాగ అనిల్ బాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఉత్సవ సమితి ప్రెసిడెంట్ పండరి నాథ్, వైస్ ప్రెవిడెంట్ మస్క్ వేణు కుమార్, ప్రధాన కార్యదర్శి మధు, సామాజిక కార్యకర్త నర్సింగ్, పరమేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డాన్స్, ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ  కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన  కాటేపాగ అనిల్ బాబు క్రీడా విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ సందర్బంగా అనిల్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు చదువు తో పాటు  క్రీడల్లో రాణించాలని అన్నారు. 

 సిటీ కళాశాలలో అతిథి అధ్యాపకుల కోసం ఇంటర్వ్యూ

ప్రిన్సిపాల్ ఆచార్య.పి.బాల భాస్కర్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)                                                ప్రభుత్వ సిటీ కళాశాల (అటానమస్)లో 2023-24 సంవత్సరానికిగాను బయో టెక్నాలజీ (1), ఆర్థిక శాస్త్ర విభాగంలో (2) తాత్కాలిక అతిథి అధ్యాపకుల నియామకానికి అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చుని ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య.పి.బాల భాస్కర్ కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారంనాడొక ప్రకటన విడుదల చేశారు. ఈ పోస్టులకు గాను పి.జి.లో 55 శాతం మార్కులు సాధించిన  అభ్యర్థులు సెప్టెంబర్ 25వ తేదీ సోమవారం ఉదయం 11.00 గం.కి సిటీ కళాశాలలో హాజరు కావచ్చునని, పిహెచ్ డి, యం.ఫిల్, నెట్, స్లెట్ వంటి అదనపు అర్హతలతో పాటు బోధనానుభావం కలిగిన వారికి ప్రాధాన్యత  ఉంటుందని ప్రిన్సిపాల్ ఆచార్య.పి.బాల భాస్కర్ తెలియజేశారు. 

 ఫ్లాగ్ మార్చ్ నిర్వహిహించిన

సోత్ జోన్ డీసీపీ సాయి చైతన్య, అడిషనల్ డీసిపీ జహంగీర్

మేకల బండ వినాయకుని దర్శించుకున్న డీసీపీ

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో సోత్ జోన్ డీసీపీ సాయి చైతన్య, అడిషనల్ డీసీపీ జహంగీర్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహిహించారు. ఈ సందర్భంగా వారు దేవ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేకల బండ వినాయకుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సోత్ జోన్ డీసీపీ సాయి సాయి చైతన్య కు నిర్వాహకులు పోసాని సురేందర్ ముదిరాజ్, పీ అవినాష్, టోనీ యాదవ్ తదితరులు శాలువాతో సన్మానించి స్వామివారి ప్రసాదాలు అందించారు. 

 

 
 భక్తులను ఆకట్టుకుంటున్న,,,,

బాలగంజ్ కాళింగ మర్దన విఘ్నేశ్వరుడు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

పాత నగరం లాల్ దర్వాజా బాలాగంజ్ లో ఏర్పాటుచేసిన కాళింగ మర్దన విఘ్నేశ్వరుని మండపంలో  గణపతి నవరాత్రి ఉత్సవ వేడుకలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. పాత నగరం మొత్తంలో అత్యంత ఎత్తైన 21  అడుగుల కాళింగ మర్దన రూపంలో ఉన్న సుందర విఘ్నేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు వేరువేరు ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివస్తున్నారు.  దశాబ్దాల తరబడి నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్టు బాలాగంజ్ యువసేన ప్రతినిధులు తెలియజేశారు.  దేశభక్తి ఆధ్యాత్మిక భావన పెంపొందించే లక్ష్యంతో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సాయంత్రం వేళలా సాంస్కృతిక సంగీత కార్యక్రమాలను భజన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు వారు వివరించారు. పాత నగరం మొత్తంలో బాలాగం విఘ్నేశ్వరుని మండపం అగ్రస్థానంలో నిలుస్తుందని బాల గణేష్ యువసేన సలహాదారు మురళీకృష్ణ తెలియజేశారు. టిడిపి అధినేత అక్రమ అరెస్టు రిమాండ్ కేవలం రాజకీయ కక్ష సాధింపు మాత్రమే 

పాణ్యం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ గౌరు చరిత రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

టీడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా "బాబుతో నేను-మేము సైతం" అంటూ నంద్యాల జిల్లా పాణ్యo నియోజకవర్గo పాణ్యo మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయం ఆవరణలో పాణ్యo మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జి గౌరు చరిత రెడ్డి ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. సామూహిక నిరాహార దీక్షలకు భారీ సంఖ్యలో మహిళలు స్వచ్చందంగా తరలి వచ్చి రిలే నిరాహార దీక్షలో కూర్చొని మద్దతు తెలిపారు.


ఈ సందర్భంగా పాణ్యం టిడిపి ఇన్చార్జ్ గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిధుల దుర్వినియోగం కాలేదని, స్కిల్ డెవలప్మెంట్  అధికారులు చెబుతుంటే, మరొక పక్క వైసీపీ ప్రభుత్వం నిధులు దుర్వినియోగంఅయ్యాయని అందుకు బాధ్యుడు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడును దురుద్దేశపూర్వకంగా అక్రమంగా కేసులో ఇరికించి రిమాండ్ పంపారని, నిధుల దుర్వినియోగంపై చంద్రబాబు నాయుడుకి ఎలాంటి సంబంధం లేదని "బాబు షూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ" కార్యక్రమం ద్వారా ప్రజలలో చైతన్యాన్ని నింపుతూ టిడిపి అధినేత ప్రజలలో చైతన్య భావాన్ని పెంచి దూసుకెళ్తున్నారని,  యువగళం పేరుతో నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఇది చూసి వైసిపి ప్రభుత్వం ఓర్వలేకనే కక్ష సాధింపులో భాగంగా అక్రమంగా, అన్యాయంగా కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తంచేశారు.


ఈకార్యక్రమంలో నంద్యాల జిల్లా పార్లమెంట్అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గౌడ్, నంద్యాల పార్లమెంట్ మహిళ అధ్యక్షురాలు పార్వతమ్మ, మండల అధ్యక్షుడు జయరామిరెడ్డి, మాజీ జెడ్పిటిసి నారాయణమ్మ, ఎంపిటిసి రంగ రమేష్, మండల నాయకులు రమణమూర్తి, లాయర్బాబు, సుధాకర్, ఖాదర్బాషా, ఇర్ఫాన్, సురేంద్ర, తిరుపాల్నాయక్, నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు దానం, కౌలురు,మద్దూరు, కొత్తూరు,నెర్వాడ, బలపనురు, ఆలమూరు,గొరుకల్లు, తమ్మరాజుపల్లె, కందికయపల్లె, పాణ్యం మండలంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు భారీ సంఖ్యలో సామూహిక నిరాహార దీక్షలో పాల్గొని విజయవంతం చేశారు.


 లంచము తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ.... 

జలకనూరు వీఆర్వో వెంకట రమణారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం మిడుతూరు మండల పరిధిలోని జలకనూరు గ్రామానికి చెందిన వెంకట రమణయ్య తన ముగ్గురు పిల్లలు కూతుర్ల పేరిట తన భూమిని దాన విక్రయముగా రిజిస్టరు చేయించాడు. భూమిని తన   పేరును తొలగించి కూతుర్ల పేర్లపై ఆన్లైన్ నందు మార్పుచేసి పాసుబుక్కులు ఇవ్వడానికి  విఆర్ఓ వెంకట రమణారెడ్డి, వెంకట రమణయ్య వద్ద నుండి 10,000/- రూపాయలు లంచము ఇస్తే పని చేస్తానని చెప్పడంతో వెంకట రమణయ్య ముందుగా 3,000/- రూపాయలు ఇవ్వగా


వెంకట రమణారెడ్డి తీసుకుని మిగిలిన 7,000/- రూపాయలను మిడుతూరు గ్రామంలోని తన ప్రైవేటు కార్యాలయము నందు తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు వల పన్ని జలకనూరు వీఆర్వో వెంకట రమణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన, చట్టబద్దమైన పనిని చేయడానికి ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచము ఆశిస్తే ముందుగా 14400 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి గాని,మొబైల్ యాప్ ద్వారాగాని 14400 నెంబర్ కు సమాచారమును అందించిన, లంచగొండి అధికారులపై చట్ట పరమైన చర్యలు తీసుకోబడతాయని, కర్నూలు ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి తెలిపారు. ఈ ఏసీబీ దాడులలో ఏసీబీ ఇన్స్పెక్టర్ తేజేశ్వర్ రావు, వెంకట కృష్ణారెడ్డి, ఇంతియాజ్ అహ్మద్, కృష్ణయ్య, వంశినాథ్ మరియు సిబ్బంది పాల్గొన్నారని కర్నూలు ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి తెలిపారు.

 మనదేశ సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత అందరిపైఉంది

అంతర్జాతీయ మానవహక్కుల కమిషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనీస పాష   

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని స్థానిక పాణ్యం లోని ఏపీ మాడల్ స్కూల్ మరియు కస్తూరిబా పాఠశాలల యందు మొక్కలు నాటే కార్యక్రమంను మరియు బాలికలతో ముఖాముఖి కార్యక్రమంను అంతర్జాతీయ మానవహక్కుల కమిషన్ రాష్ట్రమహిళా అధ్యక్షురాలు అనీస పాష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమే మాట్లాడుతూ విద్యార్థులకు తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యతగా ఉంటూ,బాగా చదువుకోని సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని సొంతం చేసుకొని సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు సహకరించాలని అనీస పాష సూచించారు. పిల్లలు పాశ్చాత్యసంస్కృతిని అలవాటు చేసుకోని, మన దేశ సంస్కృతిని మర్చిపోతున్నారని, మన దేశ ఉనికి చాలా గొప్పదని, మన కట్టు, బొట్టు వలన మన భారతదేశప్రత్యేకతను అన్నిదేశాలు ఇష్టపడుతున్నాయని,


మనం మన దేశ సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. అనంతరం విద్యార్దులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. బాలికలు తమ హక్కుల కోసం పోరాడినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందనితెలిపారు. ఈకార్యక్రమంలో అంతర్జాతీయ  మానవహక్కుల కమిషన్ జిల్లా ఉపాధ్యక్షురాలు కళ్యాణీ, మాడల్ స్కూల్ ప్రిన్సిపాల్ దినేష్ బాబు, కస్తూరిబా పాఠశాల ప్రిన్సిపాల్ లలిత మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

 డోన్ లో సిఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి

అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి19-09-23 వతేదీ డోన్ పట్టణానికి రానున్న సందర్భంగా పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ 19-09-23 వతేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రిష్ణగిరి మండలం లక్కసాగరం వద్ద 74 చెరువులకు నీటిని నింపే పంప్ హౌస్ ప్రారంభోత్సవం చేసిన అనంతరం డోన్ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారన్నారని,  సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టేందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకొని పనులు చేపట్టి సీఎం పర్యటనను సాఫీగా విజయవంతం చేయాలని,


ప్రోటోకాల్ ప్రకారం అధికారులకు అప్పగించిన పనులు బాధ్యతాయుతంగా చేపట్టి ఎలాంటి లోపాలు లేకుండా పూర్తిచేయాలని, హెలిప్యాడ్ నుండి బహిరంగ సభ వేదిక వరకుఎలాంటిఅవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డికి సూచించారు. హెలిప్యాడ్ ల్యాండ్ అయ్యే ప్రదేశంలో ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి దుమ్ము లేయకుండా వాటరింగ్ పెద్దఎత్తున చేయాలని ఆర్అండ్బి, అగ్నిమాపక అధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు అవసరమైన జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఏపీఎస్పిడిసిఎల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. హెలిప్యాడ్, మీటింగ్ సమీపాల్లో ఏర్పాటు చేసిన సేఫ్ రూముల్లో అత్యవసర మందులతో పాటు నిపుణులైన డాక్టర్లు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓ, జిల్లాఆసుపత్రి వైద్యాధికారులను ఆదేశించారు.గ్రీన్ రూమ్, సభా వేదిక, విజిటర్స్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఆహార పదార్థాలలో కల్తీ లేకుండా జాగ్రత్తగా చెక్ చేయాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సభా వేదిక ప్రాంతంలో ప్రాపర్ గా త్రాగునీటివసతి, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని డోన్ మున్సిపల్ కమిషనర్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను నంద్యాలజిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 19-09-23 వతేదీన డోన్ పట్టణానికి వస్తున్న సందర్భంగా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సియం పర్యటన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డిలతో కలిసి కలెక్టర్ సమీక్షసమావేశం  నిర్వహించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పుల్లయ్య, అన్ని శాఖల జిల్లాధికారులు, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి,డిఆర్డిఏ పిడి శ్రీధర్ రెడ్డి, ఆర్టీవో శివారెడ్డి, డిఎంహెచ్ఓ వెంకటరమణ, డిసిహెచ్ఎస్ జఫ్రుల్ల, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డోన్ ఆర్డిఓ వెంకటరెడ్డి, సంబంధిత మండలాల తాసిల్దారులు, ఆర్అండ్బి ఎస్ఈశ్రీధర్రెడ్డి, జిల్లాధికారులు పాల్గొన్నారు.

 బాల్యవివాహాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోండి 

నంద్యాలజిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్, ఎస్పీ రఘువీర్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలో బాల్య వివాహ నిరోధకచట్టాన్ని జిల్లాలో పటిష్టంగా అమలుచేసి బాల్య వివాహాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్, ఎస్పీ రఘువీర్ రెడ్డి కమిటీ సభ్యులను, సంబంధితశాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ బాల్య వివాహాల నిరోధక చట్టంపై వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ బాల్యవివాహాలని యంత్రణకు ఏర్పాటు చేసిన గ్రామ, పట్టణ స్థాయి కమిటీలు చురుకుగా వ్యవహరించి అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ప్రతి గ్రామంలో సచివాలయ సిబ్బందితో పాటు అందుబాటులో ఉన్న మానవ వనరులను వినియోగించుకుని బాల్య వివాహాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని


18 సంవత్సరాల్లోపు వున్న పిల్లల జాబితా అన్ని పాఠశాలల్లోఅందుబాటులో ఉంటుందని, సచివాలయ సిబ్బందితో కోఆర్డినేట్ చేసుకొని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని, బాల్యవివాహాలను వ్యతిరేకించిందేకు విద్యావంతులు, మేధావులు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేసి అరికట్టేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు సంపూర్ణ అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరిగే గ్రామాలు, వీటికి గలమూలకారణాలను అన్వేషించి వ్యవస్థను సరిచేసేందుకు కమిటీ సభ్యులు కృషిచేయాలని, చిన్నవయస్సులోనే వివాహాలు చేయడం వలన పిల్లలు మానసికంగా, శారీరకంగా ఇబ్బందిపడే అంశాలపై తల్లిదండ్రులకు సంపూర్ణ అవగాహన కల్పించాలని,

ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే సంబంధిత సమాచారాన్ని చేరవేసే విధంగా పకడ్బందీచర్యలు చేయాలని, బాల్యవివాహాలను నివారించడం ద్వారా మాతా,శిశు మరణాలు తగ్గుముఖం పడతాయని, బాల్య వివాహాలు జరిపితే శిక్ష అనేది ఒక భాగం మాత్రమేనని ఇందుకు తగ్గ కౌన్సిలింగే ప్రధానమని, ప్రజలకు వారికి అర్థమయ్యే విధంగా వివరిస్తే నిర్వహిస్తే సులభంగా అరికట్టవచ్చని కలెక్టర్ సంబంధిత అధికారులనుఆదేశించారు. అనంతరం జిల్లాఎస్పీ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయిలో నెట్వర్క్ఉన్న నేపథ్యంలో బాల్య వివాహాలు జరుగుతున్న కమ్యూనిటీ వర్గాలను గుర్తించి అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రధానంగా సుగాలి,చెంచు, బుడగజంగాలు తదితర వర్గాలపై దృష్టిపెట్టి నియంత్రించాలనీ తెలిపిన అనంతరం బాల్యవివాహాల నిషేధ చట్టం గొడపత్రికలను జిల్లాకలెక్టర్ మనజీర్ జిలాని సమన్ మరియు

ఎస్పి రఘువీర్ ఆవిష్కరించారు.ఈ సమావేశంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు జుబేదా బేగం,మహిళా శిశుసంక్షేమ శాఖ పీడీ నిర్మల,బాలల సంరక్షణాధికారి శారద, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

 గణేష్ నిమజ్జన మహోత్సవానికి పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయండి

నంద్యాలజిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలో 22-09-23 వతేదీ (శుక్రవారం)సామూహిక గణేష్ విగ్రహ నిమజ్జన మహోత్సవ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా శాంతియుతవాతావరణంలో వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ పోలీస్ యంత్రాంగాన్ని సంబంధిత అధికారులనుసూచించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డితో కలిసిసంబంధితఅధికారులు, ఉత్సవకమిటీ సభ్యులతో మొదటి కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ  22-09-23 వ తేదీన స్థానిక చిన్నచెరువు కట్ట వద్ద ఉన్న వినాయక ఘాట్ లో గణేష్ నిమజ్జనానికి అవసరమైన భద్రతా ఏర్పాట్లతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు కోరిన మేరకు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గణేష్ విగ్రహాల ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయసంఘటనలు జరగకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ప్రశాంతవాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులు, సంబంధిత అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పరస్పర సహకారంతో నిమజ్జన ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. నంద్యాలలో దాదాపు 320 విగ్రహాలు నిమజ్జనం కానున్నట్లు కమిటీసభ్యులు సూచిస్తున్నారని,


ఇందుకు అవసరమైన ఏర్పాట్లును చేసుకోవాలని, ప్రధానంగా గణేష్ విగ్రహాలు తరలించే రహదారి మార్గాలైన మున్సిపల్ఆఫీసు, సంజీవనగర్ గేటు, శ్రీనివాససెంటర్, సిటీ బస్టాండ్, గాంధీచౌక్,  కల్పనా సెంటర్, బైర్మల్ వీధి, బంగారు అంగళ్లవీధి, రాజ్ థియేటర్,టెక్కె, సాయిబాబానగర్, ఎన్టీఓస్ కాలనీ, కోవెలకుంట్ల జంక్షన్, బొమ్మల సత్రం తదితర ప్రాంతాలలో విద్యుత్ తీగల సర్దుబాటు, రోడ్లకు ప్యాచ్ వర్క్ లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఊరేగింపు ప్రదేశాల్లోని ముఖ్య కూడలి ప్రాంతాల్లో త్రాగునీటి వసతి ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. నిమజ్జన ప్రదేశంలో పటిష్ట బారికేడింగ్ ఏర్పాటు చేయాలని ఆర్అండ్ బి  ఈఈని ఆదేశించారు. భారీ గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు వీలుగా క్రేన్ లను ఏర్పాటు చేయాలని ఉపరవాణాశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. చిన్న చెరువు, కుందూనది సమీపంలో పుట్టీలతో పాటు అవసరమైన స్విమ్మర్లను, లైఫ్ జాకెట్,రోప్స్ తదితర మెటీరియల్ తో సిద్ధంగా ఉండాలని, అగ్నిమాపక, మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. గాంధీ చౌక్, చిన్నచెరువు సమీపంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని డియంహెచ్వోను ఆదేశించారు. అనంతరం జిల్లాఎస్పీ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ రూట్ మ్యాప్ ప్రకారం గణేష్ విగ్రహాల ఊరేగింపుకు పకడ్బందీ ప్రణాళికతో పాటు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పోలీస్ యంత్రాంగానికి సంపూర్ణ సహకారం అందించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసు శాఖకు సహకరించి గణేష్ నిమజ్జోత్సవం పూర్తయ్యేంతవరకు కార్యకర్తలుసహకరించాలని సూచించారు. ఈకార్యక్రమంలో డిఆర్ఓ పుల్లయ్య, గణేష్ మహోత్సవ కేంద్ర సమితి కమిటీ అధ్యక్షులు గంగిశెట్టి విజయకుమార్, రామకృష్ణ విద్యా సంస్థల అధినేత జి. రామకృష్ణారెడ్డి, కార్యాధ్యక్షులు వైద్యం నాగేంద్ర, ప్రధాన కార్యదర్శి నెరవాటి అమర్నాథ్, సివిచలంబాబు, నిమ్మకాయల సుధాకర్, కోశాధికారులు ధమాంశంకర్, రమణ  తదితరులు పాల్గొన్నారు.


 నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్యూటీ డాక్టర్ పై చర్యలు తీసుకోవాలి

సిపిఐ(యంయల్) ఆర్ఐ పార్టీ డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాలజిల్లా ‌నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో గోస్పాడు మండలంలోని కస్తూరిబా పాఠశాలకు చెందిన విద్యార్థినికి పుడ్ పాయిజన్ అయిందని తీసుకొని వస్తే పేషెంట్లను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్యూటీ డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని సిపిఐ (యంయల్ )ఆర్ఐ పార్టీ జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్ డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్ లో పేషెంట్లను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డాక్టర్లు, నర్సులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించకుండా పెషేంట్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూన్నారని, సమాజంలో దేవునితర్వాత డాక్టర్ కు మాత్రమే దండం పెడతారని, అలాంటి డాక్టర్లే ఈవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పేషెంట్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, చాలా మంది పేదలు ప్రైవేట్ హస్పిటల్ కు వెళ్లే స్తోమత లేక ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తే,నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పేషెంట్ల ప్రాణాలనుగాలికి వదిలేసిన వైద్యులను తక్షణమే విధులనుండి తప్పించాలని, నిర్లక్ష్యంచేసిన డాక్టర్లను విధుల నుండి తొలగించడం వల్ల తప్పించడం విధులలో పనిచేసే డాక్టర్లు మారుతారని, గోస్పాడు మండలంలోని కస్తూరిబా పాఠశాలలో పుడ్ పాయిజన్ అయిందంటే హాస్టల్ నిర్వాహకులు నాసిరకం భోజనం చేశారాఅని, హాస్టల్ నిర్వాహకులు తయారు చేసిన భోజనంపై విచారణ చేపట్టి ఇందుకు కారణమైన హాస్టల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను సిపిఐ (యంయల్ )ఆర్ఐ పార్టీ జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్ డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో కలాంబాష, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఓటర్ల జాబితాలో పేర్ల సవరణ ప్రక్రియను వేగంవంతంచేయండి 

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితాలో పేర్ల సవరణ ప్రక్రియను వేగవంతం చేసి 15-09-23 వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. ఎలక్షన్ కమిషన్ కార్యాలయం నుండి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ "ప్రత్యేక ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ 2024" కు సంబంధించి ఓటర్ల జాబితా పునః పరిశీలన,6,7,8 ఫామ్ ల స్వీకరణ, ఇంటింటి సర్వే, డూప్లికేట్, షిఫ్టెడ్, డెత్ ఎలెక్టోరల్స్, జంక్ క్యారెక్టర్, 10 కంటే ఎక్కువ ఓట్లు ఉన్నహౌసెస్,రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్, మొదటి,రెండవ, మూడవ దశలో ఎపిక్ కార్డ్స్ జనరేషన్, ప్రిటింగ్, పంపిణీ తదితర అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణకు సంబంధించి 75,259 ఓటర్లను పునః పరిశీలించి నివేదికలు సమర్పించామని, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్ బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల నుండి రాజకీయపార్టీల ప్రతినిధులు సూచించిన   27,194 బోగస్ ఓట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి తొలగించామని వివరించారు. 6,7,8 ఫామ్ లకు సంబంధించి స్వీకరించిన 42,843 దరఖాస్తులలో 18,433 ఓటర్ జాబితాలో పొందుపరిచామని


పెండింగ్లో ఉన్న 21,989 క్లెయిమ్స్ ను నాలుగు రోజుల్లో పూర్తి చేస్తామని, డూప్లికేట్, షిఫ్టెడ్, డెత్ ఓటర్లకుసంబంధించి  47,432 ఓట్లను జాబితాలో సవరించామని, తొలగించిన ఓట్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న 26,587 ఓట్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నాలుగు రోజుల్లో పూర్తి చేస్తామని, ఇంటింటి సర్వేలో 10,936 ఓటర్లు కొత్తగా నమోదు చేసుకున్నారని, జంక్ క్యారెక్టర్ కు సంబంధించి పెండింగ్లో ఉన్న 105 ఓటర్లను,10 కంటే ఎక్కువ ఓట్లు వుండి పెండింగ్ లో ఉన్న 3908 గృహాలను క్షేత్రస్థాయిలో పునః పరిశీలించి జాబితాలో పొందుపరుస్తామని కలెక్టర్ వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ల జాబితాలోని సవరణలు,జంక్ క్యారెక్టర్స్, మార్పులు, చేర్పులకు సంబంధించి వివరాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి 15-09-23 తేదీలోగా స్వచ్ఛమైన, పారదర్శకమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఈఆర్ఓ, ఏఈఆర్వోలను ఆదేశించారు. నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హల్ నుండి నంద్యాల జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ పుల్లయ్య, అన్ని నియోజకవర్గాల ఈఆర్ఓలు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

 

 ప్రజల్లో సానుభూతి కోసమే.....చట్టానికి ఎవరూ అతీతులుకాదు

ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసేందుకు నంద్యాలకు వచ్చిన సీఐడీ అధికారుల ముందు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆడిన నాటకాలు అంతా ఇంతాకావని, ఆడినాటకాలు ఇక నుండైనా కట్టిపెట్టాలని, చట్టానికి ఎవరూ అతీతులు కాదని నిరూపితం అయ్యిందని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబును అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టుకు తరలించే క్రమంలో అధికారులు చంద్రబాబును హెలికాప్టర్ ద్వారా తీసుకెళ్తామని చెప్పినా ససేమిరా అంటూ రోడ్డు మార్గంలోనే వస్తానని చంద్రబాబుపట్టుబట్టడంలో అంతర్యం గ్రహించాలని, చంద్రబాబుపై ప్రజల్లో సానుభూతి వస్తుందన్న దురుద్ధేశంతో చేసిన పన్నాగం అని, ఆయన అవినీతి, అక్రమాల గురించి తెలిసిన ప్రజలు ఎక్కడా చంద్రబాబు అరెస్ట్ను అడ్డుకొనే ప్రయత్రం చేయలేదని నంద్యాల పద్మావతినగర్ వైఎస్సార్సీపీ కార్యాలయంలో శిల్పాచక్రపాణిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి చంద్రబాబు అరెస్ట్ పై హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో సూట్ కేసు కంపెనీలను సృష్టించి 371కోట్ల ప్రజాధనాన్నిదోచుకోన్నారని,


ఈ కేసులో సీఐడీ అధికారులు మాజీ ముఖ్యమంత్రిచంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేసేందుకు వచ్చిన సందర్భంగా ఆయన చేసిన నాటకాలు ఎంతగానో రక్తికట్టించాయని ఎద్దేవాచేశారు. ఇలాంటి నాటకాలు ఇకనైనా కట్టిపెట్టాలని, నాడు ఓటుకు నోటుకేసులో తప్పించుకొనిదాక్కున్నాడని, పత్తికొండలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు తనతో బస్సులో చంద్రబాబు బేరసారాలు ఆడాడని దానికి తానే సాక్ష్యమని, చంద్రబాబు రిమాండుకు నిరసనగా రాష్ట్రంలో బంద్ కు పిలుపునిస్తే ఎక్కడా బంద్ జరిగిన దాఖలాలు కనిపించలేదని, అవినీతి చేసి బంద్ లు చేయడం ఎంతవరకు సమంజసమో టీడీపీ నేతలు చెప్పాలని, అమరావతి రాజధాని నిర్మాణంలో కోట్లాది రూపాయలను దోచుకొన్నారని, అనేక కేసుల్లో విచారణ జరుపకుండా కాలయాపన చేస్తూ న్యాయస్థానాల్లో స్టేలు తీసుకురావడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని,అన్నీ కేసుల్లో విచారణ జరపాల్సిందేనని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనని, రానున్న రోజుల్లో వాస్తవాలువెలికివస్తాయని, చట్టం తనపనితాను చేసుకుపోతుందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్షతో చంద్రబాబును అరెస్ట్ చేయించారన్న దానిలో వాస్తవం లేదని, ఆయన చేసినఅవినీతి, అక్రమాలతోనే జైలుకు వెళ్ళాడన్నది బహిరంగ రహస్యమని, ఇకచంద్రబాబునాయుడి పని అయిపోయిందని, టీడీపీ నాయకుల పనికూడాఅయిపోయిందనితెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం వైఎస్సార్సీపీసమన్వయకర్త శిల్పా భువనేశ్వరరెడ్డి, వైసీపీ నాయకులు తిరుపంరెడ్డి, బుగ్గారెడ్డి, జెడ్పీటీసీ మహేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, నాగేశ్వరరెడ్డి, మోత్కూరు నాగేశ్వరరెడ్డి, ప్రవీణ్ తేజ, పుల్లయ్య, సుబ్బరామయ్య, పుల్లారెడ్డి, షభారెడ్డి, తదితర నాయకులుపాల్గొన్నారు.


 శ్రీ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునులస్వామివార్లను దర్శించుకున్న ...

భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యంత పుణ్యప్రదమైన నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో కొలువుదీరిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని భారత సుప్రీంకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కుటుంబ సమేతంగా శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయం వద్దకు చేరుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి వారికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి లవన్న, అర్చకస్వాములు, వేదపండితులు ఆలయ సంప్రదాయాన్నిఅనుసరించి ఘనంగా స్వాగతం పలికారు. రత్నగర్భ గణపతిస్వామి వారిని దర్శించుకున్న అనంతరం శ్రీ మల్లికార్జునస్వామి వారిని దర్శించుకుని,


ప్రత్యేకపూజలు నిర్వహించి, మల్లికాగుండంలో ప్రతిబింబించే ఆలయ విమాన గోపురాన్ని దర్శించుకొని శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవార్లకు కుంకుమార్చన జరిపించిన అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కు ఆలయ అర్చకులు వేదాశీర్వచనంతో శేషవస్త్రాలను,ప్రసాదాలు మరియు శ్రీ శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారి జ్ఞాపికను అందజేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వెంట ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎవి.శేషసాయి, ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఎన్.శ్రీనివాసరావు, జిల్లా రెవెన్యూ  అధికారి బి.పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

 మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిలిపివేసిన పథకాలను తిరిగి ప్రారంభించండి

నంద్యాల జిల్లా ముస్లింహక్కుల పోరాటసమితి రాష్ట్ర కార్యదర్శి యూనుస్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ను తిరిగి ప్రారంభించాలని ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి యూత్ యూనస్,రాష్ట్ర నాయకులు షేక్ యూనిస్, నంద్యాల జిల్లా అధ్యక్షులు హయ్యద్ గులాంబాషా డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనార్టీ నిరుద్యోగ యువకులకు బ్యాంకు ద్వారా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలు ఇప్పించాలని, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా గతంలో నిరుద్యోగ యువతకు బ్యాంకుల ద్వారా లింకేజీ రుణాలు మరియు డ్రైవర్లకు కార్లు ఇచ్చేవారని, పథకాలన్నిటినివైఎస్ఆర్సిపి ప్రభుత్వం రద్దు చేయడం దారుణమని, జగన్మోహన్ రెడ్డి కేవలం నవరత్నాలు పథకాలను అమలు చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా చేపట్టే పథకాలను రద్దు చేయడం జరిగిందని, గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ కార్పొరేషన్ల ద్వారాఎలాంటి రుణాలు బలహీనవర్గాలకు అందించలేదని, అందరికీ అందించే నవరత్నాలు ద్వారా అందరి అభివృద్ధి చెందుతుందని జగన్మోహన్ రెడ్డి ఆశించడం సరికాదని, నిరుపేదమైనార్టీలు ఎక్కువ మంది ఉన్నారని,వారు సొంతంగా షాపులను పెట్టుకొని వ్యాపారం చేయాలంటే వారికి 10000/-,15000/-ల వరకుఖర్చుఅవుతుందని,గత ప్రభుత్వాలు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా బ్యాంకులతో లింకేజీ రుణాలు ఇప్పించారని, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ సబ్సిడీ ఇచ్చేదని దీని ద్వారా అనేకమంది వ్యాపార రంగంలో స్థిరపడ్డారని, ఇప్పటికైనావైసిపిప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లను పునర్జీవింపజేసి వీటి ద్వారా గతంలో అమలు చేసిన పథకాలను తిరిగి ప్రారంభించాలని,ముస్లిం యువకులు ఉద్యోగాలు లేక వ్యాపారాలు చేయలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అలాంటి వారిని ఆదుకోవాలంటే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిలిపివేసిన పథకాలను తిరిగి ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.

 చిరుధాన్యాల ఉత్పత్తులను ప్రోత్సహించండి

జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలో చిరుధాన్యాల ఉత్పత్తులను గణనీయంగా పెంచాలని జిల్లాకలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ సంబంధిత రైతులను ప్రోత్సహించారు.స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లోని వైయస్సార్ సెంటినరీహాల్ ఆవరణలో చిరుధాన్యాల విక్రయ ఉత్పత్తులను జిల్లాకలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి లు పరిశీలించారు. మిల్లెట్ సంవత్సర సందర్భంగా జిల్లాలో చిరుధాన్యాల సాగు విస్తీర్ణస్థాయిని విస్తృతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రైతులను ప్రోత్సహించాలని,


వర్షభావ పరిస్థితుల్లో  కూడా చిరుధాన్యాల ఉత్పత్తులు బాగా వస్తాయని డిఆర్డిఎ, రైతుసాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంట ఉత్పత్తుల, తినుబండారాల స్టాళ్లను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఇతర అధికారులు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే చిరుధాన్యాల ఉత్పత్తులను ప్రోత్సహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను సూచించారు.