భూ పోరాటాలకు సిద్ధం కండి

సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు పిలుపు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలో ఇళ్ల స్థలాలు,సాగు భూమిలేని పేదలకోసం భూపోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నంద్యాల జిల్లా సమితి సమావేశం స్థానిక నంద్యాల సిపిఐ కార్యాలయం నందు సంఘం జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు మాట్లాడుతూ నంద్యాలజిల్లాలోని సాగు భూముల కోసం ఉపయోగపడే ప్రభుత్వ భూములు,ఇండ్ల స్థలాల కోసం ఉపయోగపడే భూములు చాలా ఉన్నాయని,వాటిని భూస్వాములు,అధికార పార్టీ నాయకులు, ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ చేస్తున్నారని,వాటిని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని భూమిలేని పేదలకు పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు.లేనిపక్షంలో వ్యవసాయ కార్మిక సంఘం భూపోరాటాల ద్వారా భూములను పేదలకు స్వాధీనం చేసి ఇవ్వడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సుబ్బరాయుడు మాట్లాడుతూ వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ నెలలో బాపట్లలో జరుగుతున్నాయని,


రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయడానికి సంఘసభ్యులు, నాయకులు అందరు కృషిచేసి జిల్లా నుండి ఎక్కువమంది వ్యవసాయ కార్మికులను సమీకరించాలని,నంద్యాల జిల్లాలో బస్సు జాతర ప్రవేశిస్తుందని,బస్సు జాతరను సిపిఐ నాయకత్వాన పెద్ద ఎత్తున స్వాగతం తెలిపి ఎక్కువ మందిని పాల్గొనేలా కృషి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మికసంఘం జిల్లా ఉపాధ్యక్షులు ప్రతాప్, ఉపాధ్యక్షురాలు మహేశ్వరమ్మ, కోశాధికారి లక్ష్మీదేవి, మాణిక్యమ్మ, ముంతాజ్, రాణి, బాలవరదరాజు, సుంకన్న సామేలు పాల్గొన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: