ఉద్యోగుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించండి

జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

 (జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)       

నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఉద్యోగుల గ్రీవెన్స్ డేను నిర్వహిస్తోందని సమస్యలను నిశితంగా, క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను సూచించారు. కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్ డే నిర్వహించి వివిధ కార్యాలయాల అధికారులు మరియు సిబ్బంది నుండి వినతి పత్రాలు స్వీకరించారు.


ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యలను నిబంధనల మేరకు క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కార మార్గాలు చూపాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేసారు. ఉద్యోగుల గ్రీవెన్స్ డే లో స్వీకరించిన అర్జీలకు సంబంధించి అధికారులు తీసుకున్న చర్యలపై పూర్తి సమాచారంతో వచ్చే సమావేశానికి రావాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 

ప్రభుత్వ ఉత్తర్వుల నెం.1233 లోని ఆదేశాల మేరకు నెలలో ప్రతినెల 3వ శుక్రవారం ఉద్యోగుల గ్రీవెన్స్ డే ను ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. నంద్యాల జిల్లాలో వివిధ శాఖలలో పనిచేస్తున్న 19 మంది  ఉద్యోగులు తమ సమస్యలపై జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి దరఖాస్తులను సమర్పించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: