వరి పంటపై రైతులకు పొలంబడి నిర్వహించిన...

గడివేముల మండల వ్యవసాయశాఖ అధికారి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని దుర్వేసి గ్రామంలో రైతులకు వరి పంటపై పొలంబడి కార్యక్రమాన్ని గడివేముల మండల వ్యవసాయ శాఖ అధికారి హేమసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా రైతులకు బ్యాలెట్ టెస్ట్ నిర్వహించి, రైతులకు పొలంబడి మీద అవగాహన కల్పించి మట్టి నమూనా పరీక్ష ఫలితాల గురించి వివరించి,రైతు యొక్క రెండు ఎకరాలు పొలంబడికి ఎంపిక చేసి,అర్ధ ఎకరాలో రైతు ఆచరించ వలసిన పద్ధతులు,ఒక ఎకరాలో ప్రయోగాల పద్ధతి,


అర్ధ ఎకరాలో సమగ్ర పంటల యాజమాన్యం అనుసరించవలసిన పద్ధతిపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో నంద్యాలజిల్లా వనరుల కేంద్రం ఏడీఏ శ్రీమతి  సరళమ్మ,మంజువాని,ఏవో ప్రభావతమ్మ ,విఏఏ వెంకట రవికుమార్,ఆర్బికే చైర్మన్ పరమేశ్వర్ రెడ్డి,రమేష్ మరియు దుర్వేసి గ్రామ రైతులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: