అంగన్వాడి వర్కర్స్ కు ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి

సిఐటియు నాయకులు డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నంద్యాల జిల్లా కమిటీ సమావేశం స్థానిక నంద్యాల నరసింహయ్య భవనంలో అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శోభారాణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన సిఐటియు నంద్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యేసు రత్నం,నాగరాజు అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నంద్యాలజిల్లా కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ కు ఎఫ్ఆర్ఎస్ ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అంగన్వాడి వర్కర్స్ కు వేతనాలు పెంచుతామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తయిన నేటికీ మాట నిలబెట్టుకోలేదని,అంగన్వాడి వర్కర్స్ పై యాపుల పేరు మీద అధిక పని భారం మోపుతూ ఉన్నారని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, అంగన్వాడీల శ్రమను దోచుకుంటుందని, కూరగాయల బిల్లులు 4 నెలలుగారాలేదని,


గృహ నిర్వహణ బిల్లులు 4 నెలలుగా రావడంలేదని,నెల నెల వేతనాలు సకాలంలో అందక అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఇబ్బందులకు గురి అవుతున్నారని,ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్వాడి వర్కర్స్ కు అమలు చేస్తామని చెప్పి నేటికీ ఆచరణ అమలుకు చర్యలు తీసుకోలేదని, జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే మాట తప్పడని వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది కానీ అంగన్వాడి వర్కర్స్ కి ఇచ్చిన మాట నాలుగు సంవత్సరాలు పూర్తయిన అమలుకు ఎందుకు చర్యలు తీసుకోలేదని, 2017 సంవత్సరం నుంచి టీఏ బిల్లులు రావడం లేదని బియ్యము,ఆయిల్, బ్యాళ్లు అంగన్వాడి సెంటర్స్ కు ప్రభుత్వం సరఫరా చేయడంలేదని, అంగన్వాడి వర్కర్స్ స్టాక్ పాయింట్ నుంచి ఆటోలకు బాడుగలు పెట్టి తీసుకు వస్తున్నారని,ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడి సెంటర్లకు సరుకులను సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అంగన్వాడి వర్కర్స్ జిల్లా కమిటీ సభ్యులు నిర్మల, సునీతమ్మ,నాగరాణి, మంజుల,ప్రమీలమ్మ, రాజ్యలక్ష్మి, నాగలక్ష్మి, నాగమణి, పద్మావతి, ఉదయిని, మదర్బి, ఎంకమ్మ, సరస్వతమ్మ  వెంకటలక్ష్మి పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: