సున్నిపెంట మండల నూతన కమిటీ ఎన్నిక

ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ధనంజయుడు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని సున్నిపెంట ఐటిఐ కళాశాలలో ఐటిఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాల విద్యార్థులతో సమావేశం నిర్వహించి, విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుని వారితో చర్చించిన అనంతరం సున్నిపెంట మండల ఏఐఎస్ఎఫ్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. సున్నిపెంట మండల అధ్యక్షులుగా చందు, కార్యదర్శిగా అజిస్, మరియు 7 మంది ఆఫీస్ బేరర్స్,21మంది కమిటీ సభ్యులతో కూడిన నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ధనుంజయుడు తెలిపారు.


ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్రిస్వామి,ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి లక్ష్మయ,సున్నిపెంట మండల ఏఐవైఎఫ్ అధ్యక్షులు మల్లి,మండల ఏఐఎస్ఎఫ్ నాయకులు రామన్న,హరీష్,శేఖర్,రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: