బడి ఈడు పిల్లలందరూ బడిలో ఉండాలి

గడివేముల ఎంపీడీవో శివమల్లేశ్వరప్ప

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని గడివేముల ఎంఈఓ కార్యాలయంలో జిఈఆర్ సర్వేపై విద్యా సంక్షేమ సహాయకులతో జరిగిన సమావేశంలో ఎంపీడీవో శివమల్లేశ్వరప్ప మాట్లాడుతూ గడివేముల మండలంలో బడిఈడు పిల్లలందరూ పాఠశాలలో ఉండే విధంగా చూడాలని, మీ బాధ్యతగా భావించి, పిల్లలందరినీ పాఠశాలలో నమోదు చేయాలని,విద్యా సంక్షేమ సహాయకులకు సూచించి,సర్వేలో ఎవరైనా పిల్లలను పాఠశాలకు పంపకుండా ఉన్నట్లయితే వారిని గుర్తించి వెంటనే పాఠశాలలో నమోదు చేయాలని సూచించారు.


ఎంఈఓ విమలా వసంతరాదేవి మాట్లాడుతూ మండలంలో 228 మంది వాలంటీర్ల ఉన్నారని,220 వాలంటీర్లు సర్వే పూర్తి చేశారని, మిగిలిన వాలంటీర్లు అందరితో సర్వే పూర్తి చేయించాలని సూచించి,చదువును మధ్యలో మానీవేసి తిరిగి చదువు కొనసాగించాలని కోరుకునే వారు ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ చదువుకొటకు అవకాశం ఉందని,అలాంటి విద్యార్థులను గుర్తిస్తే వారిని వెంటనే ఓపెన్ స్కూల్ నందు నమోదు చేయించాలని,సంబంధిత అప్లికేషన్ ఫారాలను విద్యాసంక్షేమ నాయకులకు అందించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: