గడివేముల మండల రైతన్నల కేబుల్ వైర్ల పై కన్నేసిన.,

కేబుల్ వైర్ల దొంగలు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)                       

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండల పరిధిలో రైతు సోదరుల కేబుల్ వైర్లపై కన్నేసిన కేబుల్ వైర్ల దొంగలు.గడివేముల మండలంలోని కుందూనది పరివాహక ప్రాంతాలలో మోటార్ల నుండి బోర్డుల వరకు కరెంటు సప్లై చేసుకోనే కేబుల్ వైర్లను గత వారంరోజుల నుండి కేబుల్ వైర్ల దొంగలు దొంగలించుకుని వెళ్తున్నారు. రైతుసోదరులకు వర్షాలు పడక పంటలకు నీరు అందక లబోదిబోమని బాధపడుతున్న వేళ రైతు సోదరులకు "మూలిగే నక్క మీద తాటికాయపడినట్టు" కేబుల్ దొంగలు రైతన్నల మీద పడి వారిని మరింత నష్టాలకు గురి చేస్తున్నారు. మార్కెట్లో ప్రస్తుతం కేబుల్ వైర్ ధర ఒక మీటరు 90/- నుండి100/-లభిస్తుంది. కుందూనది పరివాహక ప్రాంతాలలో రైతు సోదరులు స్టార్టర్ బాక్స్ నుండి మోటారుకు కరెంటు సప్లై చేసుకొని,నీటిని తమ పొలాలకు మళ్ళించుకుని పంటలు పండించుకునేందుకు దాదాపు100 మీటర్ల నుండి 200 మీటర్లు పైగా అవసరం పడుతుండడంతో కేబుల్ వైర్లను రైతన్నలు కొనుగోలు చేసి కరెంటు కనెక్షన్లను తీసుకుంటున్నారు. బోర్డు నుండి విద్యుత్ మోటార్ వరకు కరెంటు సప్లై కొరకు తీసుకున్న వైరును పొలంలో ఎవరూ లేని సమయంలో కేబుల్ వైర్లను కేబుల్ దొంగలు దొంగలించుకుని వెళుతున్నారని రైతు సోదరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ శాఖ అధికారులు మరియు సిబ్బంది కేబుల్ వైర్ల దొంగలపై దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని రైతు సోదరులు కోరుకుంటున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: