డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ నూతన విగ్రహా ప్రతిష్టాపన

మినరల్ వాటర్ ప్లాంట్ ఆవిష్కరించిన...

శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా మహానంది మండలం పుట్టుపల్లి గ్రామ ప్రజల కోరిక మేరకు గ్రామంలో నిర్మించిన భారత రాజ్యాంగ నిర్మాత,సంఘ సంస్కర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి ఆవిష్కరించి,పుట్టుపల్లి గ్రామప్రజల దాహార్తిని తీర్చడం కోసం నూతన త్రాగునీటి శుద్ధి కేంద్రాన్ని శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ సభ్యులు శిల్పాచక్రపాణి రెడ్డి ప్రారంభించారు. అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ అనంతరం శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ సభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ పుట్టుపల్లి గ్రామంలోని ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉంటారని,


అంబేడ్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకు విరాళాలు అందించి, విగ్రహ ప్రతిష్టకు సహకరించిన గ్రామ ప్రజలందరికీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అభినందనలు మరియు ధన్యవాదములు తెలియజేశారు, పుట్టుపల్లి గ్రామం మీద తనకున్న అనుబంధాన్ని గ్రామ ప్రజలతో పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలలో శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా భువనేశ్వర రెడ్డి, మహానంది మండల వైస్సార్సీపీ నాయకులు, పుట్టుపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: