మహిళల ఆర్థిక ప్రగతి కోసమే వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం

మార్క్ఫెడ్ చైర్మన్పీ పీ నాగిరెడ్డి

        (జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)                   

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం మండలం, జనుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ వేదిక నుండి వరుసగా నాలుగో ఏడాది స్వయం సహాయక సంఘాల మహిళలకు"వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం"లబ్ది మొత్తాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసిన కార్యక్రమాన్ని లైవ్ ద్వారా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి మార్క్ఫెడ్ చైర్మన్ పి.పి నాగిరెడ్డి, మైనారిటీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారు హబీబుల్లా, హస్త కళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, డిఆర్ఓ పుల్లయ్య, డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి తదితరులు వీక్షించారు. అనంతరం మార్క్ఫెడ్ చైర్మన్ పి.పి నాగిరెడ్డి మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో ఉన్న 36,626 సంఘాలకు గాను మొత్తం రూ.48.95 కోట్లు స్వయం సహాయక సంఘ మహిళల్లో ఆత్మ స్థైర్యాన్ని పెంచడం కోసం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని,


జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్ధిక ప్రగతి కోసం సున్నా వడ్డీ లబ్ధి మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసి,రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలవడం గర్వించదగ్గ విషయమని,వరుసగా నాలుగో ఏడాది వైయస్సార్ సున్నా వడ్డీ పథకం కింద జిల్లా వ్యాప్తంగా పట్టణం, గ్రామీణంలో ఉన్న 36,626 స్వయం సహాయక సంఘాలకు గాను"సున్నా వడ్డీ"సాయం మొత్తం రూ.48.95 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని,మహిళలు బాగుంటేనే ఇల్లు బాగుంటుందని తద్వారా గ్రామం,రాష్ట్రం,సమాజం బాగుంటుందని నమ్మి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన చేసి 90 శాతం పథకాలు మహిళల పేరిట అమలు చేస్తున్నారని, గ్రూపులో ఉన్న మహిళా సభ్యులు చిన్న చిన్న వ్యాపారం చేస్తూ పెద్ద వ్యాపారవేత్తలుగా ఎదగాలని తెలిపారు.

మైనారిటీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారు హబీబుల్లా మాట్లాడుతూ బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన పొదుపు సంఘాల్లోని పేదింటి అక్కచెల్లెమ్మల మీద ఏ మాత్రం వడ్డీ భారం పడకుండా ప్రభుత్వమే వారి తరఫున వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద ఆ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని,నాలుగో ఏడాదికి సంబంధించి "వైఎస్సార్ సున్నా వడ్డీ" పథకం క్రింద జిల్లాలోని పట్టణ,గ్రామీణ పరిధిలో 36,626 సంఘాలకు గాను మంజూరయిన రూ.48.95 కోట్ల మొత్తాన్ని స్వయం సహాయక సంఘ లబ్దిదారులకు మెగా చెక్కు రూపంలో అందించారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: