పోతిరెడ్డిపాడు ద్వారా తక్షణమే నీళ్లు వదలాలి...

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్

 (జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలో త్రాగునీరు,సాగునీరు అవసరాలను దృష్టిలో ఉంచుకొని తక్షణమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీళ్లను వదిలి జిల్లాలోని జలాశయాల ద్వారా అన్ని కాలువలకు నీళ్లు వదలాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా కమిటీ డిమాండ్ చేస్తు జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్ కు వినతి పత్రం అందజేశారు.  ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం నేటికీ 863 అడుగులు ఉందని,నీటి వనరులచట్టం ప్రకారం శ్రీశైలం నీటిమట్టం 854 అడుగులకు చేరిన వెంటనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీళ్లు వదలాల్సి ఉన్నదనీ, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 863 అడుగులకు చేరిన నీళ్లను వదలకపోవటం వల్ల జిల్లాలో ఇప్పటికే వేసిన పంటలు ఎండిపోతున్నాయని,ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎమ్మెల్యేలు,రాష్ట్ర మంత్రులు,సాగునీటి ప్రాజెక్టుల ఉన్నత స్థాయి అధికారులు,వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు,జిల్లా కలెక్టర్ గారితో జరిగిన ఐడిబిఐ సమావేశంలో పోతిరెడ్డిపాడు హెడ్ లెటర్ ద్వారా నీళ్లు విడుదలపై ఒక స్పష్టమైన ప్రకటన చేయకపోవడం,నీళ్లు వదిలే తేదీ నిర్ణయించకపోవడం ఎంతో బాధాకరంగా ఉందని,


ప్రస్తుతం నంద్యాలజిల్లాలో ఖరీఫ్ సీజన్లో వేసిన పంటలు ఎండిపోతున్నవని, రైతంగం తీవ్రంగా నష్టపో తున్నారని,శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి 875 అడుగులు తర్వాత చేయాలని నిబంధన ఉన్న విద్యుత్ ఉత్పత్తి చేస్తూ తెలంగాణ బోర్డు నీటిని కిందికి వదులుతున్నారని, ఫలితంగా రాయలసీమ ప్రజలగొంతు ఎండిపోతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని త్రాగునీరు,సాగునీటి కొరకు కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని తక్షణమే శ్రీశైలం జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా విడుదల చేయాలని  డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్,జిల్లా సహాయ కార్యదర్శి రామచంద్రుడు, జిల్లా నాయకులు సురేష్, సుధాకర్,ప్రసాద్, శ్రీనివాసరెడ్డి మరియు కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మార్క్ తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: