ఇంటర్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను ఉచితంగా ఇవ్వాలి
పిడిఎస్ యూ, ఎస్ఎఫ్ఐ డిమాండ్
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో నూతన డిగ్రీ కళాశాల బిల్లింగ్ తక్షణమే నిర్మించాలని, విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందజేయాలని పిడిఎస్యు, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాణ్యం తాహసిల్దార్ మల్లికార్జున్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు రఫీ,ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ప్రతాప్, పిడిఎస్యు జిల్లా నాయకులు బాలాజీ,సిపిఎం మండల కార్యదర్శి భాస్కర్లు మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్,డిగ్రీ కళాశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు అందరికి ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందజేయాలని,రాష్ట్రంలో 439 ప్రభుత్వ,131 ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులలో నూటికి 70 శాతం మంది SC,ST,BC, మైనార్టీ విద్యార్థులేనని, కాలేజీల్లో విద్యనుభ్యసించే విద్యార్థులకు త్రాగునీరు, మరుగుదొడ్లు,ఫర్నిచర్, ల్యాబ్,లైబ్రరీ,తరగతి గదుల కొరత,లెక్చరర్ల కొరత సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, 2023-24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఉచితంగా ఇవ్వలేమని చేతులెత్తేసిందని,ఇంటర్ బోర్డులో ఉన్న 126 కోట్లను నాడు నేడు పనులకు , జగనన్న ఆణిముత్యాలకు దారి మళ్ళించిన ప్రభుత్వం కేవలం16 కోట్లతో ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయవచ్చని,ప్రభుత్వానికి మాత్రం విద్యార్థుల విద్యాభ్యాసానికి ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందజేయడానికి చేతులు రావడం లేదని,గత సంవత్సరం ప్రతిష్టాత్మకంగా 292 హైస్కూల్స్ లో తీసుకువచ్చిన హై స్కూల్ ప్లస్ (ఇంటర్) విద్య అట్టర్ ప్లాఫ్ అయ్యిందని,బుక్స్, ల్యాబ్,లెక్చరర్స్ కొరత వల్ల 70 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని,100 హైస్కూల్ ప్లస్ లో జీరో శాతం వచ్చిందని విమర్శించారు. తక్షణమే పాణ్యం నియోజకవర్గంలో నూతన డిగ్రీ కళాశాల బిల్లింగ్ నిర్మించాలని వారు డిమాండ్ చేశారు.లేని పక్షంలో డిగ్రీ కళాశాల నూతన బిల్లింగ్ ఏర్పాటు చేసేంతవరకు దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి సంఘం నాయకులు రవి నాయక్, హరి,వినయ్,కళాశాల విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు
Home
Unlabelled
ఇంటర్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను ఉచితంగా ఇవ్వాలి...... పిడిఎస్ యూ, ఎస్ఎఫ్ఐ డిమాండ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: