యస్.కొత్తూరు గ్రామంలో ఘనంగా......నాగులచవితి వేడుకలు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలో నాగుల చవితి పండుగను మహిళలు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకొని వారి మొక్కలను తీర్చుకున్నారు. పాణ్యం మండలంలోని యస్.కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి నాగులచవితి పండుగ సందర్భంగా భక్తులు,అర్చకులు స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహించి మొక్కుబడులను చెల్లించుకున్నారు,


నంద్యాల జిల్లాలోని యస్. కొత్తూరు గ్రామానికి వివిధ ప్రాంతాలనుంచి మహిళలు, పురుషులు అధిక సంఖ్యలో తరలివచ్చి కొత్తూరు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నైవేద్యాలను సమర్పించారు.ఆలయ ప్రధాన అర్చకులు నాగ పుల్లయ్య,నారాయణ స్వామి,సురేష్ స్వామి,ఈఓ రామకృష్ణల ఆధ్వర్యంలో పాలాభిషేకం,కుంకుమార్చన,విశేష పూజలు చేసారు, నంద్యాల జిల్లాలో నుండి వివిధ ప్రాంతాల నుండి, గ్రామాలనుండి అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుని,పాలాభిషేకం మరియు ప్రత్యేక పూజలు జరిపించి తమ కుటుంబ సభ్యులందరూ సుఖసంతోషాలతో ఉండాలని మొక్కులు తీర్చుకొని కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నారు.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: