మెడికో హర్షవీణ ను సన్మానించిన

విజయవాడ గోషలైట్స్ అధినేత  నరేంద్ర(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా,శ్రీశైలం నియోజకవర్గం, కొత్తపల్లి మండలంలోని యం.లింగాపురం గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ ఎరుకలి రాము, ఉపాధ్యాయురాలు రుక్మిణి దంపతుల రెండవ కుమార్తె హర్షవీణ కృషి పట్టుదలతో చదివి నీట్ 2023 పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి అనంతపురం మెడికల్ కాలేజీలో సీటు సాధించిన సందర్భంగా విజయవాడ గోషలైట్స్ అధినేత నరేంద్ర గారు ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ


ఏకాగ్రతతో కష్టపడి చదువుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, ప్రతి విద్యార్థి కృషి పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని, చదువును కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితేనే విద్యార్థులు తాము అనుకున్న గమ్యస్థానాలకు చేరి విజయపతాకం ఎగరవేస్తారని తెలిపారు.ఈ సందర్భంగా స్నేహితులు, విద్యార్థులు,బంధువులు, ఉపాధ్యాయులు,గ్రామ ప్రజలు హర్షవీణకు అభినందనలు తెలియజేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: