వైసీపీని వీడి టిడిపి తీర్థం పుచ్చుకున్న...

గోనవరం వైసిపి ఉపసర్పంచ్ మరియు వార్డ్ మెంబర్లు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యo నియోజకవర్గం పాణ్యం మండలంలోని గోనవరం గ్రామంలో మహాశక్తి కార్యక్రమం మరియు భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని పాణ్యo  మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జి గౌరు చరిత రెడ్డి నిర్వహించారు. గోనవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మినీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన భవిష్యత్తు కు గ్యారంటీ కార్యక్రమం లో పాల్గొన్నందుకు వచ్చిన గౌరు చరిత రెడ్డికి ప్రజలుఘనస్వాగతం పలికారు. అనంతరం గోనవరం గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ పథకాలతో,కరపత్రాలను పంపిణీ చేస్తూ ఇంటింటికీ తిరిగి పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ,ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం గ్రామ ప్రజలతో మాట్లాడుతూ టిడిపిని అధికారంలోకి తీసుకొని రావాలని, టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ప్రజలను గౌరు చరిత రెడ్డి కోరారు.

గోనవరం గ్రామంలో ప్రజలతో టిడిపి పథకాలను వివరిస్తున్న గౌరు చరిత రెడ్డి

 

మహాశక్తి కార్యక్రమం మరియు భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమానికి విచ్చేసిన గౌరు చరిత రెడ్డి సమక్షంలో గోనవరం వైసీపీ ఉప సర్పంచ్ పెద్దింటి సాహెబ్ బాషా, వార్డ్ మెంబర్లు, మందుల మౌలాలి, జాబీర్హుస్సేన్, ఫిదాహుస్సేన్, మాలన్బి లతోపాటు దాదాపు 50 కుటుంబాలు వైసీపీని వీడి గౌరు చరితారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోగా వారిని టిడిపి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జయరామిరెడ్డి, నంద్యాల పార్లమెంట్ మహిళ అధ్యక్షురాలు పార్వతమ్మ, గోనవరo గ్రామ నాయకులు దానం,  రాజేష్, మల్లారెడ్డి, నారాయణ, సురేషు, మండల నాయకులు నియోజవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు దానం, రమణమూర్తి, లాయర్ బాబు, ఎంపీటీసీ రంగరమేష్, గోరుకల్లురవి, కొనిదేడు రాంపుల్లారెడ్డి, ఆలమూరు చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ అభిమానులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం పాణ్యం మండల కేంద్రం లోని బస్టాండ్ సమీపంలో ఉన్న 7వ అంగన్వాడీకేంద్రం ప్రహరీ గోడను కూల్చిన ప్రాంగణాన్ని పరిశీలించి, ఐసిడిఎస్ సూపర్వైజర్ నాగ సుంకమ్మను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పాణ్యం అంగన్వాడి సెంటర్ ప్రాంగణాన్ని కూల్చిన ప్రదేశం గురించి వివరాలు అడిగి తెలుసుకుంటున్న గౌరు చరితరెడ్డి 


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రహరీ గోడ రహదారికి అడ్డంగా ఉందని నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని, 17 సంవత్సరాల నుండి కొనసాగుతున్న ప్రభుత్వ అంగన్వాడి ప్రహరీ గోడను కూల్చడం అన్యాయమని, రాజకీయ దురుద్దేశంతోనే ప్రహరీ గోడను కూల్చారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, నిర్మాణ సమయంలో ఆక్రమణకు గురైనదా లేదా అని పరిశీలించకుండా, అధికారులు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారని అధికారులను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు జయరాంరెడ్డి, ఎంపిటిసి రంగారమేష్, టిడిపినాయకులు రమణమూర్తి, లాయర్ బాబు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: