కేసి రైతులకు నీరందించకపోతే రాజీనామా చేయండి

స్పందించకపోతే ఆమరణ దీక్షకు దిగుతాం.... 

సిపిఐ నాయకుల డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో లక్ష అరవై వేల ఎకరాల కేసి కెనాల్ ఆయకట్టు ప్రాంతం ఉందని జూన్ మాసంలో రావలసిన సాగునీరు ఆగస్టు పూర్తి అవుతున్న రాకపోవడం వల్ల రైతులు వేసిన అరతడి మొక్కజొన్న,కంది,పత్తి పంటలు పూర్తిగా ఎండిపోయి నష్టాలలో కూరుకుపోయారని, సాగునీరు అందించలేని స్థితిలో ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్నారని రైతులకు నీళ్లు ఇవ్వలేని నాయకులు రాజీనామ చేయాలని లేకపోతే క్రాఫ్ హాలిడే ప్రకటించి నష్టపరిహారం చెల్లించాలని, సాగునీరును క్రిందికి వదిలేటప్పుడు ఓట్లేసిన ఈ ప్రాంత రైతులు మీకు గుర్తుకు రారా అని అని రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని,


ఆమరణ దీక్షకు దిగుతామని సిపిఐ జిల్లా నాయకులు రఘురాం మూర్తి, రమేష్ బాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం స్థానిక పాత బస్టాండ్ లో రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించి,తహసిల్దార్ రాజశేఖర్ బాబు కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కెసి కెనాల్ రైతు పోరాట కమిటీ నాయకులు మౌలాలి, వెంకటరమణ, బాషా, భాస్కర్, పులిరాజు, ఏఐఎస్ఎఫ్ నాయకులు మహానంది, వీరేంద్ర, దినేష్, వినోద్ పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: