కరెంటు సబ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించిన.....

గడివేముల మండల రైతన్నలు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా  ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండల పరిధిలోని స్థానిక కరెంటు సబ్స్టేషన్ ను గడివేముల,కొరపోలూరు మరియు సోమాపురం గ్రామాలకు చెందిన రైతన్నలు ముట్టడించి ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా గడివేముల, కొరపోలూరు,సోమపురం గ్రామాల రైతు సోదరులు మాట్లాడుతూ మా గ్రామాలకు కేవలం రెండు గంటలు మాత్రమే పంటలకు నీరు పెట్టుకునేందుకు విద్యుత్ సరఫరా వస్తుందని,సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 9 గంటలు నిరంతరాయంగా రైతులకు కరెంటు ఇస్తామని చెప్పిన మా గ్రామాలకు గత వారం రోజుల నుండి కేవలం రెండు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతుందని,కేవలం రెండు గంటలు సరఫరా చేస్తే మా పంట పొలాలకు నీరును ఏ విధంగా అందించాలో అర్థం కావడం లేదనే ఆవేదనతోనే సబ్ స్టేషన్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేస్తున్నామని,


రాష్ట్రప్రభుత్వం చెప్పినట్లుగా తొమ్మిది గంటలు నిరంతరాయంగా మా గ్రామాలకు విద్యుత్ సరఫరాను అందించాలని డిమాండ్ చేశారు.రైతుల నిర్వహించిన ఈ కార్యక్రమానికి గడివేముల మండలం టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి రైతు సోదరులకు మద్దతుగా ధర్నా కార్యక్రమంలో పాల్గొని రైతన్నలకు అండగా నిలిచారు.అనంతరం గడివేముల టిడిపి మండల కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను సమయపాలన పాటించకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నారని,రైతు సోదరులు వేసుకున్న పంటలకు వర్షాలు లేక నీరు అందక పంటలను ఎలా పండించుకోవాలా అని అలమటిస్తున్న తరుణంలో రైతన్నలకు విద్యుత్తును కేవలం రెండు మూడు గంటలు సరఫరా అందించడం ఎంతవరకు సమంజసం అని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలు వేసుకున్న పంటలు పండించుకునేందుకు తొమ్మిది గంటల విద్యుత్ సరఫరాను కచ్చితంగా రైతు సోదరులకు అందించాలని డిమాండ్ చేశారు.

అనంతరం గడివేముల మండలం టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి మరియు రైతు సోదరులు 9 గంటల నిరంతర విద్యుత్ను సరఫరా చేయాలని డిమాండ్ తో కూడిన వినతి పత్రాన్ని గడివేముల విద్యుత్ శాఖ ఏఈ గారికి అందించారు.ఈకార్యక్రమంలో గడివేముల, కొరపోలురు,సోమాపురం గ్రామాల రైతు సోదరులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: